Mari Selvaraj : స్టార్ హీరోల సినిమాలకు అద్భుతమైన కలెక్షన్స్ రావడం అనేది మామూలు. కానీ ఎటువంటి స్టార్ కూడా లేకుండా అద్భుతమైన కలెక్షన్స్ రావడం అనేది మాట్లాడుకోదగ్గ విషయం. ఇలా చాలా తక్కువ మంది దర్శకులకు మాత్రమే జరుగుతుంది. దర్శకులకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కడం అనేది అసలైన అదృష్టం. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన దర్శకులలో మారి సెల్వ రాజ్ ఒకరు.
పిరియారుమ్ పెరుమాళ్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మారి. ఆ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ధనుష్ హీరోగా కర్ణన్ అనే సినిమాను చేశాడు. ఆ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత చేసిన మామన్నన్ మంచి ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా తీసుకొచ్చింది. అయితే స్టార్ హీరోస్ లేకుండా కూడా సినిమాలు చేసి అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టగలిగాడు మారి.
గత సంవత్సరం, మారి సెల్వ రాజ్ తన స్టార్ పవర్ ని పక్కన పెట్టి తమిళనాడులో లో ₹30 కోట్లకు పైగా తన సినిమాతో కలెక్షన్స్ వసూలు చేయగలిగాడు. స్టార్స్ లేకుండానే వాలై (Vaazhai) సినిమాతో తన స్టార్ పవర్ ని చూపించాడు.
బైసన్ సినిమాతో ఇది అదృష్టం కాదని మళ్లీ నిరూపించాడు. స్టార్స్ లేకుండా, పెద్ద సంగీత దర్శకుడు కూడా లేకుండా ఈ సినిమాతో అద్భుతమైన సక్సెస్ కొట్టాడు. తమిళనాడులో బైసన్ ₹50 కోట్లు దాటింది. కమర్షియల్ గా ప్రమోట్ చేయబడిన డ్యూడ్ తో పోటీగా నిలిచి ఈ స్థాయి సక్సెస్ అందుకుంది బైసన్ సినిమా.
లోకేష్ కనగరాజ్ మరియు నెల్సన్ ఎక్కువ ప్రజాదరణ పొందారు. కానీ వాళ్లు స్టార్స్ మరియు ఫ్రాంచైజ్ సినిమాలు లేకుండా తమను తాము నిరూపించుకునే వరకు వారి స్టార్ పవర్ మనకు తెలియదు. అప్పట్లో మణిరత్నం, శంకర్ మరియు ఇప్పుడు మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని సంపాదించుకున్నాడు. ఈ జనరేషన్ లో ఉన్న అసలైన స్టార్ డైరెక్టర్ మారి అని చెప్పిన తప్పులేదు.
ధనుష్ హీరోగా మారి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిస్టారికల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మారి సెల్వ రాజ్ చేసిన అన్ని సినిమాలు కంటే కూడా ఇది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది అని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.
Aslo Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో భారీ మార్పులు, కథపై క్లారిటీ లేకుండానే గ్రీన్ సిగ్నల్?