Shiva 4k Official Trailer: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఐకానిక్ చిత్రం ‘శివ‘ (Shiva Re Release). సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ మూవీ ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేసింది. శివ మూవీతో ఓ యూత్ ఫుల్ యాక్షన్ చిత్రాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఈ మూవీతో అటూ నాగార్జున, ఇటూ ఆర్జీవీ కెరీర్ మలుపు తిరిగింది. శివ మూవీతో బాలీవుడ్లోనూ ఆర్జీవీ పేరు మారుమోగింది.
దీంతో బాలీవుడ్ స్టార్స్ సైతం వర్మతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపారు. ఇటూ నాగార్జున కూడా యాక్షన్, కమర్షియల్ ఆఫర్స్ క్యూ కట్టాయి. గీతాంజలితో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న నాగార్జున శివ సినిమాతో యాక్షన్ హీరోగా గుర్తింపు పొందాడు. శివ సినిమా వచ్చిన 36 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా వచ్చి బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ ఐకానిక్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 14న ఈచిత్రం 4k టెక్నాలజీలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
శివ రీ రిలీజ్ సందర్భంగా తాజాగా రీ రిలీజ్ ట్రైలర్ని విడుదల చేశారు. 4k (Shiva 4k Trailer) టెక్నాలజీ విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ట్రైలర్ మూవీ లవర్స్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ రీ రిలీజ్ ట్రైలర్ సరికొత్త టెక్కాలజీ కొత్త అనుభూతిని అందిస్తుంది. ఇందులో ఒక్క సీన్, ముఖ్యంగా సైకిల్ చైన్ యాకన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సినీ ప్రముఖులంత శివ మూవీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా విధి, గతిని విని అభినయంచి విధానాన్నే మార్చేసిన చిత్రం శివ అంటూ ఎన్టీఆర్, రాజమౌళి, ప్రభాస్, మణిరత్నం, మహేష్ బాబు, దర్శకుడు నాగ్ అశ్వీన్, సందీప్ రెడ్డి వంగా, హీరో నాని వంటి స్టార్స్ ఈ చిత్రాన్ని కొనియాడుతూ ట్రైలర్ లో కనిపించారు. .
అలాగే శేఖర్ కమ్ముల, అల్లు అర్జున్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ వంటి దిగ్గజాలు సైతం ఈ చిత్రాన్ని కొనియాడుతు ఇండియ సినిమాని స్టైల్నే మార్చేసిందంటూ చెప్పుకొచ్చారు. కాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేందర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 1998లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అదే పేరుతో వర్మ 1990లో హిందీలోనూ రీమేక్ చేసి విడుదల చేయగా అక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్పై మాత్రమే తీసిన డైరెక్టర్స్.. యాక్షన్ పై కూడా ఫోకస్ పెట్టారు. అలా ఇండియన్ సినిమా తీరునే మార్చేసిన శివ మళ్లీ రీ రిలీజ్ అవుతుండటంతో ఇండస్ట్రీ మొత్తం పండగ చేసుకుంటుంది.
Also Read: Bigg Boss 9 Madhuri: భరణి రీఎంట్రీ వెనుక మెగాబ్రదర్.. అసలు గుట్టురట్టు చేసిన మాధురి!