Rowdy Janardhan Shooting Update: అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజ కార్యక్రమంతో కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. తాజాగా సెకండ్ షెడ్యూల్‌పై మూవీ టీం అప్డేట్ ఇచ్చింది. కాగా రాజావారు రాణివారు ఫేం రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గత అక్టోబర్లో లాంచ్ చేశారు. ఆ వెంటనే అక్టోబర్ 20 నుంచి రెగ్యూలర్ షూటింగ్‌ని మొదలుపెట్టారు.
తొలి షెడ్యూల్ పూర్తవడంతో మూవీ టీం కాస్తా బ్రేక్ తీసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్కి రెడీ అయ్యింది. ఈ నెల నవంబర్ 10వ తేదీ నుంచి సెకండ్ షెడ్యూల్‌ని స్టార్ట్ చేయబోతున్నారట. ఈ మేరకు కొత్త పోస్టర్ తో మూవీ టీం అప్డేట్ ఇచ్చింది. రౌడీ జనార్థన్ స్పీడ్ చూస్తుంటే త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని అనుకున్న సమయానికి థియేటర్లలోకి వచ్చేలా కనిపిస్తోంది. కాగా విజ య్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోల దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ని దిల్ రాజు ఎప్పుడో ప్రకటించారు. ఫ్యామిలీ స్టార్ మూవీ సమయంలో ఈ కాంబో ఫిక్స్ అయ్యింది. కానీ, విజయ్ కింగ్ డమ్ మూవీతో బిజీగా ఉండటం వల్ల ఆలస్యం అయ్యింది.
మరోవైపు దిల్ రాజు పలు చిత్రాలతో భారీ డిజాస్టర్స్ చూశారు. దీంతో రౌడీ జనార్థన్ సెట్స్పైకి తీసుకువచ్చేందుకు ఆయనకు లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. మొత్తానికి ఈ చిత్రం సెట్స్పైకి రావడం, చకచక షూటింగ్ జరుపుకుంటుండటంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. కాగా ఈ సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో యాంగ్రీ మ్యాన్, సీనియర్ హీరో రాజశేఖర్ కీ రోల్ పోషిస్తున్నారు. ఇందులో ఆయన విలన్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.
#VijayDeverakonda – #Ravikirankola మూవీ #RowdyJanardhan సెకండ్ షెడ్యూల్ నవంబర్ 10 తేదీ నుంచి స్టార్ట్ అవుతుందని సమాచారం. #VD15 #KeerthySuresh #DilRaju #SVC59 @SVC_official @TheDeverakonda @KeerthyOfficial pic.twitter.com/WVetgpgZpx
— BIG TV Cinema (@BigtvCinema) November 4, 2025
అలాగే ఇందులో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. విజయ్తో తొలిసారి జతకట్టడం, పెళ్లి తర్వాత కీర్తి నటిస్తున్న తొలి మూవీ ఇదే కావడంతో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. పైగా రాజశేఖర్ విలన్ నటిస్తుండటంతో మూవీపై మరింత బజ్ పెరిగింది. మరోవైపు దిల్, విజయ్ కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది కావడం విశేషం. అయితే వరుస డిజాస్టర్స్ తర్వాత విజయ్ కింగ్ డమ్ తో మంచి విజయం అందుకున్నాడు. పాన్ ఇండియా హిట్ కొడుతుందనుకున్న ఈ చిత్రం ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పిచింది. కమర్షియల్ గా కూడా పర్వలేదు అనిపించింది. కానీ, అభిమానులు ఆశించిన రేంజ్ లో హిట్ మాత్రం కొట్టలేకపోయింది. ఈసారి ఎలాగైన రౌడీ జనార్థన్ తో బిగ్ హిట్ కొట్టాలని ఇటూ విజయ్, అటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.