BigTV English
Advertisement

Vd14 : విజయ్ దేవరకొండ సినిమాలో భారీ మార్పులు, కథపై క్లారిటీ లేకుండానే గ్రీన్ సిగ్నల్?

Vd14 : విజయ్ దేవరకొండ సినిమాలో భారీ మార్పులు, కథపై క్లారిటీ లేకుండానే గ్రీన్ సిగ్నల్?

Vd14 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరో లలో విజయ్ దేవరకొండ ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించిన విజయ్ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారాడు. తరుణ్ భాస్కర్ దర్శకుడుగా పరిచయమైన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కూడా దగ్గర అయిపోయాడు విజయ్. ఆ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ విడుదల చేసింది.


ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకుడుగా పరిశ్రమైనా అర్జున్ రెడ్డి సినిమాలో నటించాడు. అర్జున్ రెడ్డి సినిమా ఒక వండర్. అప్పట్లో శివ సినిమా ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో ఆ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అర్జున్ రెడ్డి సినిమా. ఇప్పటికీ కూడా విజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ లేకపోయినా కూడా ఇప్పటివరకు నిలబడ్డారు అంటే కారణం అర్జున్ రెడ్డి సినిమా అని చెప్పాలి.

స్క్రిప్ట్ లో మార్పులు 

టాక్సీవాలా సినిమాతో దర్శకుడుగా మంచి సక్సెస్ సాధించాడు రాహుల్. ఆ సినిమా ఫుటేజ్ బయటకు వచ్చేసినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా తర్వాత రాహుల్ చేసిన సినిమా శ్యామ్ సింగ రాయ్. నాని నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ అందుకుంది. అప్పుడు టిక్కెట్ రేట్లు ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాలేదు.


విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ గా రాయలసీమ నేపథ్యంలో జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారక ప్రకటన కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ విషయంలో భారీ మార్పులు జరుగుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

జాగ్రత్త పడుతున్నారా 

రీసెంట్ టైమ్స్ లో విజయ్ దేవరకొండ చేసిన సినిమాలేవి కూడా ఊహించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు. అందుకోసమే ఈ సినిమా గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ స్క్రిప్ట్ లో భారీ చేంజెస్ చేస్తున్నారు. ఈ సినిమా మీద విజయ్ కు విపరీతమైన నమ్మకాలు ఉన్నాయి.

గౌతం తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్డమ్ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. సినిమాను విపరీతంగా నమ్మాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ సీక్వెల్ వస్తుందో లేదో గ్యారెంటీ లేదు. ముఖ్యంగా నాగ వంశీ ఈ సినిమాకి భారీ లెవెల్లో ఎలివేషన్ ఇచ్చాడు కానీ అదేదో వర్కౌట్ కాలేదు. ఇక విజయ్ చేస్తున్న అన్ని సినిమాలు మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Spirit : వాట్ ఏ సడన్ సప్రైజ్, ప్రభాస్ స్పిరిట్ పూజ రేపే

Related News

Kaantha First Spark: దుల్కర్ కాంత.. చాలా గట్టిగానే ఉండబోతున్నట్టుందే

Parasakthi: సింగారాల సీతాకోకవే.. ఏముందిరా సాంగ్.. నెక్స్ట్ లెవెల్ అంతే

Ustaad Bhagat Singh : సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ, మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి?

Anupama Parameswaran : బైసన్ బాగా కలిసి వచ్చింది, వైజయంతి బ్యానర్ లో అనుపమ సినిమా

Naveen Polishetty: సింగర్ గా మారిన నవీన్ పోలిశెట్టి, మామ ఎక్కడ తగ్గట్లేదు

Mari Selvaraj : స్టార్స్ లేకుండానే సూపర్ హిట్స్, ఇది డైరెక్టర్ స్టామినా

Shiva 4k Official Trailer: నాగార్జున శివ మూవీ మరికొన్ని రోజుల్లో రీ రిలీజ్ కానున్న సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ విడుదల చేశారు.

Rowdy Janardhan: విజయ్‌ ‘రౌడీ జనార్థన్‌’ క్రేజీ అప్‌డేట్‌.. సెకండ్‌ షెడ్యూల్‌ మొదలయ్యేది అప్పుడే

Big Stories

×