కొడాక్ కంపెనీ తక్కువ ధరలో మంచి టీవీలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే KODAK X900 32 inch HD Ready LED TVని పరిచయం చేసింది. ఈ స్మార్ట్ టీవీ మీద ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ క్రేజీ డిస్కౌంట్ అందిస్తోంది. ఏకంగా 50 శాతం తగ్గింపు ధరలో అందుబాటులో ఉంచింది.
KODAK X900 32 inch HD Ready LED TV అసలు ధర రూ. 15,999 ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఏకంగా సగం ధరకు అంటే రూ. 7,999కి అందిస్తోంది. అంతేకాదు, చక్కటి EMI సదుపాయాన్ని అందిస్తుంది. నెలకు రూ. 282 నుంచి మొదలయ్యే EMI ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. క్యాష్ ఆన్ డెలివరీతో పాటు ఆన్ లైన్ పేమెంట్స్ ను అవకాశం కల్పిస్తోంది. పలు బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్స్ చేస్తే 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ 60 Hz రీఫ్రెష్ రేటును కలిగి ఉంది. 1366 x 768 రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. మంచి కలర్ కోసం 100 శాతం జీరో బ్రైట్ డాట్స్ LED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. డిజిటల్ నాయిస్ రిడక్షన్ తో వస్తుంది. 178 వ్యూ యాంగిల్ ను కలిగి ఉంటుంది. 350 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది. రెండు స్పీకర్లతో చక్కటి సౌండ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. 20 వాట్స్ స్పీకర్ అవుట్ పుట్ తో వస్తుంది. ఆటోమేటిక్ వ్యాట్యూమ్ లెవెల్, ఆడియో ఈక్వలైజర్ తో వస్తుంది.
Read Also: 7,000mAh బ్యాటరీ, 6.7 ఇంచుల డిస్ ప్లే.. రిలీజ్ కు ముందే Moto G67 స్పెసిఫికేషన్లు లీక్!
ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, గ్లాస్ ప్రొటెక్షన్, మైక్రో లెన్స్ ఆప్టికల్ డిజైన్ సన్నని బెజెల్, మాయిశ్చర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ కాంపోనెంట్స్ ఉంటాయి. కనెక్టివిటీ కోసం 2 HDMI Ports, 2 USB Ports ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీ మాద ఏడాది వారెంటీ ఉంటుంది. 6 నెలల పాటు యాక్సెసరీస్ వ్యారెంటీని అందిస్తుంది. ఇక ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ టీవీకి యూజర్ రేటింగ్ 4.1/5గా ఉంది.
Read Also: ఇండియాలో చాట్ జీపీటీ ఫ్రీ.. ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?