BigTV English

AA22xA6: అల్లు అర్జున్ మూవీలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే?

AA22xA6: అల్లు అర్జున్ మూవీలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే?

AA22xA6: ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప(Pushpa ) సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించారు.. ఈ సినిమా తర్వాత ‘పుష్ప 2’ సినిమా చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టారు. అంతేకాదు ఈ సినిమాతో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ఈ సినిమా రెండవ స్థానాన్ని దక్కించుకుంది. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అని అభిమానులు ఆత్రతగా ఎదురు చూడగా.. ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో తన 22వ చిత్రాన్ని ప్రకటించారు అల్లు అర్జున్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ (Kalanidhi maran) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోని కూడా మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసింది. హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి.


అల్లు అర్జున్ సినిమాలో సీనియర్ హీరోయిన్..

దీనికి తోడు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Padukone) ఇందులో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) తొలిసారి విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాలో ఒక కీలక పాత్రకు సీనియర్ హీరోయిన్ ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. విలన్ గా కూడా ఆకట్టుకుంది. అంతేకాదు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఆమె ఎవరో ఇప్పటికే గుర్తుకొచ్చి ఉంటుంది కదా.. నిజమే.. ఆమె ఎవరో కాదు రమ్యకృష్ణ(Ramya Krishnan). నటనకు కేరాఫ్ అడ్రస్.. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తుంది. నీలాంబరిగా, శివగామిగా తన ఉనికిని చాటుకున్న రమ్యకృష్ణ.. ఇప్పుడు అల్లు అర్జున్ మూవీలో నటిస్తున్నట్లు సమాచారం.


పవర్ఫుల్ పాత్ర కోసం ఎంపికైన రమ్యకృష్ణ..

అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక పవర్ఫుల్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు చిత్ర బృందం ఈమెను సంప్రదించగా.. ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే ,రష్మిక మందన్న తోపాటు జాన్వీ కపూర్ , మృణాల్ ఠాగూర్ వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో అల్లు అర్జున్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం..మరి భారీ అంచనాల మధ్య, భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

యంగ్ బ్యూటీలకు ఆదర్శంగా రమ్యకృష్ణ..

రమ్యకృష్ణ విషయానికి వస్తే.. యంగ్ స్టార్ హీరోయిన్ లకి కూడా గట్టి పోటీ ఇస్తూ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.. ఒకవైపు హీరోల పాత్రలకు తల్లిగా నటిస్తూనే.. మరొకవైపు అదిరిపోయే పాత్రలతో కంటెంట్ బేస్డ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది రమ్యకృష్ణ.. ఏది ఏమైనా ఈ వయసులో కూడా అవకాశాలు అందుకుంటూ తన తోటి తరం హీరోయిన్లకు భారీ షాక్ కలిగిస్తోందని చెప్పవచ్చు.. అంతేకాదు ఇప్పుడు ఈమె జాడలోనే చాలామంది హీరోయిన్లు విలక్షణ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు.

also read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటేనే తుఫాన్.. స్టార్ హీరో సంచలన ట్వీట్!

Related News

Malaika Arora: 51 ఏళ్ల వయసులో రెండో పెళ్లి… నేను రొమాంటిక్ అంటున్న నటి!

Manam Movie: ఐసీయూ బెడ్ మీద నుంచి  ఆ సినిమా డబ్బింగ్ చెప్పిన హీరో… ఇది కదా డెడికేషన్ అంటే?

War 2 : మీ హీరోతో సినిమా చేస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు, టేబులే మిగిలింది ఇక్కడ

Nagarjuna: ఆ దర్శకుడును పీడించిన నాగార్జున, చివరికి ఏం జరిగిందంటే?

AR Muragadas: అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు మురగా, మీరు షెడ్డుకు పోయినందుకా?

Big Stories

×