BigTV English

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటేనే తుఫాన్.. స్టార్ హీరో సంచలన ట్వీట్!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటేనే తుఫాన్.. స్టార్ హీరో సంచలన ట్వీట్!

Pawan Kalyan:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను అందుకున్న ఈయన తన సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయకపోయినా.. పాపులారిటీ మాత్రం నార్త్ వరకు పాకిపోయింది. ఒకవైపు ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూనే.. మరొకవైపు రాజకీయాలలో కూడా చక్రం తిప్పుతున్నారు. అలా దాదాపు పది సంవత్సరాల పాటు నిర్విరామ శ్రమ తర్వాత.. గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో గెలిచి, ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు పవన్ కళ్యాణ్.


పవన్ కళ్యాణ్ పై రజినీకాంత్ ప్రశంసలు..

ఇప్పుడు ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇటీవల ‘హరిహర వీరమల్లు’ సినిమాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలను లైన్ లో పెట్టారు. ఓజీ సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిసెంబర్ లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఒక తూఫాన్ అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth ). ఈ మేరకు ఆయన ఒక ట్విట్టర్ పోస్ట్ కూడా పెట్టారు.


పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ తూఫాన్ – రజనీకాంత్

అసలు విషయంలోకి వెళ్తే .. రజనీకాంత్ ఈ యేడాదికి సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజినీకాంత్ కి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనకు రిప్లై ఇస్తూ.. రజినీకాంత్ ఒక ట్వీట్ పంచుకున్నారు.”ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నా ప్రియ సోదరుడు, రాజకీయ తూఫాన్ పవన్ కళ్యాణ్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను” అంటూ రజనీకాంత్ తెలిపారు. మొత్తానికైతే ఈ రెండు ట్వీట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా సూపర్ స్టార్ రజనీకాంత్ పవన్ కళ్యాణ్ ను ఒక రాజకీయ తూఫాన్ అని ప్రస్తావించడంతో పవన్ అభిమానులు సంతోషంతో తేలిపోతున్నారు.

రజనీకాంత్ కి శుభాకాంక్షలు చెప్పిన పవన్ కళ్యాణ్..

అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో.. “వెండితెరపై సూపర్ స్టార్ రజనీకాంత్ అనే టైటిల్ కనిపించగానే థియేటర్ ఏ రేంజ్ లో మారుమోగేదో పలుమార్లు నేను చెన్నైలో చూశాను. ఆ స్థాయి అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి కథానాయకుడు రజనీకాంత్. నటుడిగా 5 దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం నిజంగా ఒక గొప్ప విషయం. సినీ జీవితంలో స్వర్ణోత్సవం చేసుకుంటున్న సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన నటనా ప్రయాణం.. కథానాయకుడిగా మెప్పించిన తీరు.. ప్రతినాయక పాత్ర పోషించిన వైనం.. తనదైన స్టైల్ ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. మరిన్ని విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని.. సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.

also read:V.K.Naresh: రూట్ మార్చిన నరేష్.. కామెడీని వదిలేసినట్టేనా?

Related News

Pawan Kalyan On Reviews : సినిమా స్టార్ట్ అయ్యేలోపే రివ్యూస్, మా ఉసురు తగులుతుంది!

OG success Event : ప్రకాశ్ రాజ్ సెట్స్‌లో ఉంటే… పవన్ కళ్యాణ్ నిర్మాతలకు చెప్పిన ఆసక్తికర కామెంట్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సీరియస్ రిక్వెస్ట్, అసలు అది జరిగే పనేనా?

Allu Arjun : అల్లు రామలింగయ్య కు అల్లు అర్జున్ నివాళి, బన్నీ కొత్త లుక్ చూసారా?

OG Success Event : బండ్లన్న లేని లోటు తీర్చిన తమన్, నవ్వు ఆపుకోలేక పోయిన పవన్

OG Success Event : నా బలహీనతతో తమన్, సుజీత్ ఆడుకున్నారు. చంపేస్తాను అంటూ పవన్ వార్నింగ్

OG Success Meet : పవన్ కళ్యాణ్ ఆ డిజాస్టర్ సినిమా లేకపోతే నేను లేను, సుజీత్ షాకింగ్ కామెంట్స్

OG Success Event : షాకింగ్ న్యూస్, ఓజీ యూనివర్స్ కు పవన్ కళ్యాణ్ నో? ఆ సైగ కి అర్థం ఏంటి?

Big Stories

×