Pawan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా తన ట్విట్టర్ వేదికగా రజనీకాంత్ ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్.. రజినీకాంత్ (Rajinikanth ) సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రజనీకాంత్ పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెబుతూ రాజకీయ తూఫాన్ అంటూ రిప్లై ఇచ్చారు రజినీకాంత్. ఇప్పుడు రజినీకాంత్ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ స్పందించారు.
మీరు మా పెద్దన్నయ్య.. రజనీకాంత్ పై పవన్ కళ్యాణ్ ట్వీట్..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, హీరోగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..” ప్రియమైన పెద్దన్న రజినీకాంత్.. మీ ఆప్యాయతతో కూడిన మాటలకు, ఆశీర్వాదాలకు నేను నిజంగా కృతజ్ఞుడిని. మీ కీర్తి పెరగాలి అని, మరిన్ని విజయాలు సాధించాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ పెట్టారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా రజనీకాంత్ ను పవన్ కళ్యాణ్ పెద్దన్నయ్య అంటూ సంబోధించడంతో అటు రజనీకాంత్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
50 వసంతాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్ కి శుభాకాంక్షలు..
ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు రజనీకాంత్ పూర్తి చేసుకోవడంతో ఈ మేరకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు పవన్ కళ్యాణ్. తన ప్రకటనలో.. “సూపర్ స్టార్ రజినీకాంత్ అనే టైటిల్ వెండితెరపై కనిపించగానే థియేటర్ ఏ రేంజ్ లో దద్దరిల్లేదో పలుమార్లు నేను చెన్నైలో చూశాను. అంత గొప్ప స్థాయి అభిమానులను మీరు దక్కించుకున్నారు. నటుడుగా ఐదు దశాబ్దాల ప్రస్తానాన్ని పూర్తి చేసుకోవడం అంటే అంత ఆషామాషీ కాదు. సినీ జీవితంలో స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రజినీకాంత్ కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలి అని, సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ తూఫాన్ -రజనీకాంత్
ఇకపోతే రజనీకాంత్ కి శుభాకాంక్షలు చెప్పడంతో పవన్ కళ్యాణ్ ప్రకటనకి ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చారు రజనీకాంత్..”ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నా ప్రియ సోదరుడు పవన్ కళ్యాణ్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఒక రాజకీయ తూఫాన్.. దేవుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను” అంటూ రజనీకాంత్ ట్వీట్ పెట్టారు. ఇక ఇప్పుడు ఆ ట్వీట్ కి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ మీరు మా పెద్దన్నయ్య అంటూ రజనీకాంత్ ను సంబోధించడం వైరల్ గా మారింది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్విట్టర్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. ఇటీవల హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఇప్పుడు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు.
Respected Sir and Big Brother , Thiru @rajinikanth Avl, I am truly grateful for your affectionate words and blessings. I cherish them in my heart with the deepest respect and gratitude.May your path of enlightenment continues with glory , success and good health. https://t.co/uqffZGsLRH
— Pawan Kalyan (@PawanKalyan) August 17, 2025
also read: AA22xA6: అల్లు అర్జున్ మూవీలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే?