BigTV English

Bigg Boss 9 Promo: ఆయేషా వర్సెస్ రీతూ.. మరీ ఇంత ఆటిట్యూడ్ అయితే ఎలా?

Bigg Boss 9 Promo: ఆయేషా వర్సెస్ రీతూ.. మరీ ఇంత ఆటిట్యూడ్ అయితే ఎలా?
Advertisement

Bigg Boss 9 Promo:ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా 6 మంది హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాతే ఆట మరింత రసవత్తరంగా మారింది. అందులో భాగంగానే తాజాగా ఆరు వారాలు పూర్తయ్యాయి. మొదటి వారం ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. రెండవ వారం మర్యాద మనీష్, మూడోవారం ప్రియా శెట్టి, నాలుగవ వారం హరిత హరీష్, ఐదవ వారం ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజ, ఆరవ వారం భరణి శంకర్ ఎలిమినేట్ అయిపోయారు. వాస్తవానికి భరణి శంకర్ ఎలిమినేషన్ ఎవరు ఊహించనిది. రేలంగి మామయ్యలా హౌస్ లో బంధాలు కొనసాగిస్తూ.. తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఈయనను హౌస్ నుంచి ఎలిమినేట్ చేయడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.


ఆటిట్యూడ్ చూపించిన ఆయేషా..

ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఏడవ వారం మొదలైంది. ఇందులో నామినేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఒక టాస్క్ నిర్వహించిన బిగ్ బాస్ .. అనంతరం రీతూ చౌదరి పై ఆయేషా చూపించిన ఆటిట్యూడ్ కు అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయేషా కామెంట్స్ పై ఇప్పుడు నెగిటివ్ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కొత్త టాస్క్ తో సరికొత్త పవర్..

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. ఈవారం మీరు నామినేషన్ చేయడానికి కావలసిన హక్కును కూడా పొందాల్సి ఉంటుంది. ఈ వారం నామినేషన్ శంఖారావాన్ని ఇమ్మానుయేల్, ఆయేషా పూరిస్తారు అంటూ గేమ్ స్టార్ట్ చేశారు బిగ్ బాస్. బిగ్ బాస్ ఇల్లు వేలాది బెలూన్స్ తో నిండి ఉంది. ఆ బెలూన్స్ ను అక్కడున్న పిన్ను సహాయంతో పగలగొట్టాలి. ఆ బెలూన్స్ లో కొన్ని నామినేషన్ టికెట్లు దాగి ఉన్నాయి. ఆ టికెట్లు పొందిన వారికి నామినేషన్ చేయడానికి వివిధ రకాల శక్తులు లభిస్తాయి అంటూ టాస్క్ నిర్వహించారు. అటు ఇమ్మాన్యుయేల్ , ఆయేషా ఇద్దరూ పోటీపడి మరీ ఆ బెలూన్స్ పగలగొట్టారు. అందులో ఆయేషాకి నామినేట్ వన్ అని రెండు టికెట్లు లభించగా.. డైరెక్ట్ నామినేట్ అని ఒక టికెట్ లభించినట్లు తెలిపింది. ఇక ఇమ్మానియేల్ రెండు నామినేట్ 2అని, మరొక 3 నామినేట్ వన్ అని వచ్చాయి బిగ్ బాస్ అంటూ తెలిపారు.


ALSO READ:Samantha : సినిమాలు లేకున్నా నంబర్ వన్ స్థానం.. సమంత రేంజ్ మామూలుగా లేదుగా!

పాపం రీతు చౌదరి..

అందులో ఉన్న పవర్ ని ఎవరితో పంచుకోవాలో మీరు నిర్ణయించుకోండి అని చెప్పగా.. ఇద్దరు కూడా తమకు నచ్చిన వారికి ఇతరులను నామినేట్ చేసే హక్కు కల్పిస్తూ ఆ నామినేషన్ టికెట్స్ ఇచ్చారు. ఆయేషా దగ్గర డైరెక్ట్ నామినేట్ చేయడానికి టికెట్ ఉండడంతో.. దానిని ఉపయోగించడం కోసం.. ఎవరినైతే డైరెక్ట్ నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ముఖంపై ఫోమ్ ని కొట్టి అందుకు గల కారణాలు చెప్పమని చెప్పగా.. ఆయేషా రీతు చౌదరిని ఉద్దేశిస్తూ నువ్వు ఇక్కడ లవ్ ట్రాక్ నడపడానికి వచ్చావు అంటూ డైరెక్ట్ నామినేట్ చేసింది. ఇక నేను లవ్ ట్రాక్ చేయడానికి వచ్చానా అని రీతు చౌదరి ప్రశ్నించగా.. తన ఆటిట్యూడ్ చూపిస్తూ రెచ్చిపోయింది ఆయేషా. ఇక బిగ్ బాస్ మాట్లాడుతూ.. రీతూ చౌదరిని మాట్లాడమని కోరినా.. ఆయేషా తాను చెప్పినా వినే ఓపిక నాకు లేదు. ఆమె చెప్పిన దానికి నేను కన్విన్స్ అవ్వను అంటూ చాలా ఆటిట్యూడ్ చూపించింది. అంతేకాదు ఆయేషా రీతు చౌదరి పై మండిపడుతూ కాస్త బిహేవియర్ ను మార్చి చూపించడంతో చూసేవారికి కాస్త ఆయేషా చాలా పొగరుగా మాట్లాడుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వీకెండ్స్ లో ఆయేషాకి సరైన బుద్ధి చెప్పాలని కూడా కోరుతున్నారు.

Related News

Thanuja: సిగ్గు లేదా తనుజా.. క్యారెక్టర్ తక్కువ చేసినా కూడా మళ్లీ మాట్లాడుతున్నావ్

Bigg Boss 9: ఫ్యామిలీ మెసేజ్, టెన్షన్ పడ్డ సంజన, ఆది కామెంట్స్ కి మొహం మాడ్చిన ఆయేషా

Bigg Boss Buzz: మనకి బంధాల అవసరమా, భరణికి మరోసారి క్లాస్ పీకిన శివాజీ

Emmanuel: నమ్మించి మోసం చేసిన ఇమ్మానుయేల్, నెగెటివిటీ స్టార్ట్ అయ్యే అవకాశం

Bigg Boss Bharani : హౌస్ నుంచి వెళ్ళిపోతూ కూడా మంచితనాన్ని వదిలిపెట్టలేదు, ప్రత్యేకంగా ఇమ్మానియేల్ కు..

Bigg Boss 9 promo : భరణి నామినేషన్, ఇమ్ము నమ్మించి మోసం చేశాడా? 

Bigg Boss 9 : ఏం మేనేజ్మెంట్ రా బాబు? ఇన్స్టాలో బూతులు మాట్లాడే దాన్ని తీసుకొచ్చి దుబాయ్ అంటారు

Big Stories

×