BigTV English

Sharwanand: షాకింగ్.. శర్వానంద్ విడాకులు.. ?

Sharwanand: షాకింగ్.. శర్వానంద్ విడాకులు.. ?

Sharwanand: ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎన్ని రోజులు ఉంటాయో చెప్పడం చాలా కష్టం. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు విడిపోతున్నారు. పెద్దలు చూసిన పెళ్లి చేసుకున్నవారు విడిపోతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు వారి భాగస్వామ్యులతో పడక విడిగా ఉంటున్నవారు కొందరు అయితే.. విడాకులు తీసుకొని మరొక పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టినవారు ఇంకొందరు. ఇక తాజాగా మరో కుర్ర హీరో కూడా తన భార్యతో విడిగా ఉంటున్నాడని వార్తలు రావడం సంచలనంగా మారింది.


యంగ్ హీరో శర్వానంద్.. తన భార్య రక్షితతో విడిగా ఉంటున్నాడని సోషల్ మీడియాలో ఒక వార్త సెన్సేషన్ గా మారింది. గత కొంతకాలంగా ఈ జంట మధ్య విభేదాలు నెలకొన్నాయని, దీంతో రక్షిత.. శర్వాని వదిలి వేరో చోట ఒంటరిగా నివసిస్తుందని సమాచారం. అంతేకాకుండా ఈ విభేదాలు ఒక కొలిక్కి  రాకపోవడంతో శర్వా – రక్షిత విడాకులకు కూడా అప్లై చేశారని టాక్ నడుస్తోంది.

ఇంకోపక్క వీరిద్దరూ విడాకులు తీసుకొనే ఆలోచనలో లేరని, కాకపోతే విడిగా మాత్రమే ఉండాలని అనుకున్నారని.. విడాకులు లేకుండా ఎవరి ఇళ్లలో వారు ఉండాలని ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. అంతేకాకుండా వారి పాపను.. తల్లి దగ్గర కొన్ని రోజులు.. తండ్రి దగ్గర కొన్ని రోజులు ఉంచుతున్నారని అంటున్నారు. ఇక ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ, ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త విని షాక్ అవుతున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట సడెన్ గా ఇలా విడిపోవడం చాలా బాధాకరమని చెప్పుకొస్తున్నారు.


ఇక శర్వానంద్- రక్షిత పెళ్లి 2023 లో రాజస్థాన్ జైపూర్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. రక్షిత.. విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తుంది. ఇక వీరిద్దరికి గతేడాది ఒక పాప పుట్టింది. ఆమె పేరు లీలా దేవి మైనేని. గతేడాది వారు ముగ్గురు వెకేషన్ కు వెళ్లినప్పటి ఫోటోలు తప్ప ఇప్పటివరకు వీరు కలిసి దిగిన ఒక్క ఫోటో కూడా సోషల్ మీడియాలో కనిపించలేదు. ఇక  శర్వానంద్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నారీ నారీ నడుమ మురారి  సంక్రాంతికి రిలీజ్ కానుండగా.. మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.

Related News

Nazriya Nazim: ఫహాద్ తో విడాకుల రూమర్స్.. ఆ హీరోతో నజ్రియా రొమాన్స్

Nag Ashwin : కర్మను ఎవరు తప్పించుకోలేరు.. దీపికాకు డైరెక్టర్ కౌంటర్!

Manchu Manoj: మిరాయ్ ఎఫెక్ట్.. చిరుకు విలన్ గా మంచు మనోజ్ ..?

RK Roja: మరో అరుదైన అవార్డు అందుకున్న రోజా సెల్వమని కూతురు!

Bandla Ganesh: ఇండస్ట్రీలో మాఫియా బతకనివ్వదు.. పచ్చి నిజాలు మాట్లాడిన బండ్లన్న

Bandla Ganesh: పొగుడుతూనే పొగ పెట్టేసిన బండ్లన్న.. అల్లు అరవింద్ రియాక్షన్!

Theater Movies: ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ 2 సినిమాలు మస్ట్ వాచ్..

Big Stories

×