US Army in Bangladesh: సరిగ్గా వారం రోజుల క్రితం.. బంగ్లాదేశ్‌లో యూఎస్ ఆర్మీ దిగింది. అమెరికాతో కలిసి.. బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తోంది? అసలు.. బంగ్లాదేశ్‌లో.. యూఎస్ ఆర్మీ చేపట్టిన సీక్రెట్ మిషన్ ఏంటి? వారి టార్గెట్ ఏంటి? రిపోర్టులు ఏం చెబుతున్నాయ్?
బంగ్లాదేశ్‌లో దిగిన యూఎస్ ఆర్మీ అధికారులు
ఆసియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా సైన్యం.. బంగ్లాదేశ్‌లో దిగింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పతనం తర్వాత.. బంగ్లాదేశ్, అమెరికా మధ్య సైనిక సంబంధాలు పెరిగాయి. ఎంతలా అంటే.. బంగ్లాదేశ్ సైన్యంతో.. యూఎస్ ఆర్మీ, యూఎస్ ఎయిర్‌ఫోర్స్ ఏకంగా జాయింట్ మిలటరీ విన్యాసాలు నిర్వహించే దాకా వచ్చాయ్ పరిస్థితులు.
అమెరికా సైన్యం కొత్త పేర్లతో రూమ్స్ బుక్..
యూఎస్ ఆర్మీ, యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన దాదాపు 120 మంది అధికారులు.. ఈ నెల 10న.. అమెరికా-బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో.. ఢాకా నుంచి చిట్టగాంగ్‌లో దిగారు. అక్కడున్న రాడిసన్ బ్లూ హోటల్‌లో చెక్ ఇన్ చేశారు. యూఎస్ సైనిక సిబ్బంది కోసం హోటల్ 85 గదులు బుక్ చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయ్. ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే.. వారి పేర్లు హోటల్ గెస్ట్ రిజిస్టర్‌లో నమోదు చేయలేదు.
బంగ్లాదేశ్ సైన్యానికి అమెరికా మద్దతిస్తోందా?
బంగ్లాదేశ్ సైన్యంతో.. ఉమ్మడి సైనిక విన్యాసాల్లో పాల్గొనేందుకు.. అమెరికా సైనిక అధికారులు వచ్చారు. వీళ్లంతా.. ఈ నెల 20న తిరిగి యూఎస్‌కు వెళ్లే అవకాశం ఉంది. అయితే.. ఏప్రిల్‌లో యూఎస్ స్పెషల్ ఫోర్సెస్ కమాండ్ ఆఫీసర్ అర్వెల్లె జాక్సన్.. బంగ్లాదేశ్ వచ్చారు. అతను.. ఆగస్ట్ 31న ఢాకాలోని వెస్టిన్ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత.. యూఎస్ ఆర్మీ సైనికాధికారులు బంగ్లాదేశ్ వచ్చారు. కానీ.. అతని మరణం అనుమానాస్పద స్థితిలో ఉన్నా.. బంగ్లాదేశ్ గానీ, అమెరికా గానీ దీనిపై బహిరంగంగా స్పందించలేదు.
అమెరికా దళాలు బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పటేంగా ఎయిర్‌బేస్‌ని సందర్శించారు..
సెప్టెంర్ 14న.. ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్ కార్గో విమానం.. చిట్టగాంగ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. ఆ తర్వాతి రోజు.. అమెరికా దళాలు బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పటేంగా ఎయిర్‌బేస్‌ని సందర్శించాయ్. గతంలో.. బంగ్లాదేశ్ సైన్యంతో కలిసి టైగర్ లైట్నింగ్, ఆపరేషన్ లైట్నింగ్ అనే రెండు ఉమ్మడి విన్యాసాల్లో.. అమెరికా దళాలు పాల్గొన్నాయి.
Also Read: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?
అమెరికా-బంగ్లా మధ్య వ్యూహాత్మక సంబంధాలున్నాయా?
ఇవి.. శాంతి పరిరక్షక సంసిద్ధతని పెంచేందుకు, రెండు దేశాల సాయుధ దళాల మధ్య పరస్పర సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు డిజైన్ చేశారు. ఈ విన్యాసాలు.. ప్రాంతీయ భద్రతని బలోపేతం చేసేందుకు, బంగ్లాదేశ్ సైన్యానికి అమెరికా మద్దతు ఇవ్వగల ప్రాంతాలని అన్వేషించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. షేక్ హసీనా పతనం తర్వాత.. బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వం, ట్రంప్ గవర్నమెంట్ మధ్య సైనిక, వ్యూహాత్మక సంబంధాలు తీవ్రమయ్యాయి.