BigTV English

Shilpa Shetty: తన రెస్టారెంట్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన శిల్పాశెట్టి .. అదే కారణమా..?

Shilpa Shetty: తన రెస్టారెంట్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన శిల్పాశెట్టి .. అదే కారణమా..?

Shilpa Shetty: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటారు పెద్దలు. ఈ సామెతను బాలీవుడ్ హీరోయిన్స్ అక్షరాలా పాటిస్తారు. అందం ఉన్నప్పుడే ఇండస్ట్రీలో ఛాన్స్ లు, డబ్బులు. అది పోతే పట్టించుకోనేవారు ఉండరు. అందుకే అందం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వేనకేసుకొని..  వాటితో బిజినెస్ లు ప్లాన్ చేసుకొని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అనంతరం చేస్తే సినిమాలు చేస్తున్నారు. లేకపోతే ఎంచక్కా ఆ బిజినెస్ లు చూసుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీ జీవితాన్ని గడుపుతున్నారు. ఎక్కువ ఇలా చేస్తుంది బాలీవుడ్ బ్యూటీస్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరికీ.. బిజినెస్ లు ఉన్నాయి. అందులో హాట్ బ్యూటీ శిల్పా శెట్టి ఒకరు.


జీరో సైజ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన శిల్పా శెట్టి ముంబైలో రెస్టారెంట్ బిజినెస్ రన్ చేస్తున్న విషయం తెల్సిందే. ముంబైలోనే అతిపెద్ద రెస్టారెంట్ గా పేరు తెచ్చుకున్న బాస్టియన్ రెస్టారెంట్ ఆమెదే. స్టార్ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ రెస్టారెంట్ లోనే కనిపించేవారు. ఇక ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న ఈ రెస్టారెంట్ ను శిల్పా శెట్టి సడెన్ గా మూసేస్తున్నట్లు ప్రకటించింది.

” ముంబైలో ఎంతో ఆదరణ తెచ్చుకున్న మా బాస్టియన్ రెస్టారెంట్ ను గురువారం నుంచి మూసివేస్తున్నామని ప్రకటించడానికి చాలా బాధపడుతున్నాం. బాస్టియన్ మాకు  ఎన్నో జ్ఞాపకాలను అందించింది. ఎన్నో మర్చిపోలేని క్షణాలను, ఇంకెన్నో మధురమైన అనుభూతులను పంచింది.  మాకెన్నో ఆనందాలను పంచిన ఈ వేదిక ఇప్పుడు మూతపడనుంది. ఇక చివరిసారిగా ఈ రెస్టారెంట్ లో ఒక చిన్న పార్టీని నిర్వహిస్తున్నాం. మా వ్యాపార భాగస్వామ్యులు, ఫ్రెండ్స్ ఈ వేడుకకు హాజరుకానున్నారు. మరో కొత్త అనుభవాలతో త్వరలోనే మీ ముందుకు వస్తాం” అని చెప్పుకొచ్చింది.


అయితే సడెన్ గా ఇంత పెద్ద రెస్టారెంట్ ను మూసేయడానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియరాలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కొన్ని రోజులుగా ఒక వివాదంలో ఇరుకున్న విషయం తెల్సిందే. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తనను రూ. 60 కోట్లకు మోసం చేశారని బిజినెస్ మ్యాన్ దీపక్ కొఠారి  కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులోనే లాక్కోలేక పీక్కోలేక ఉన్న శిల్పా.. చివరకు రెస్టారెంట్ ను సైతం మూసివేసింది బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది  తెలియాల్సి ఉంది.

Related News

MLC Kavitha: సంతోష్‌ రావ్‌.. చిరంజీవి, ప్రభాస్‌లను కూడా మోసం చేశాడు..

Mirai First Review: సెకండాఫ్‌లో బోరింగ్ సీన్స్… ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ?

Gayatri Gupta: రోజూ అలాంటి టచ్ ఉండాల్సింది… లేకపోతే గాయత్రికి నిద్రపట్టదట

Allu Sirish: అన్నలా అవ్వడం కష్టం కానీ.. మనం రూట్ మారుద్దాం

Kishkindhapuri: ఎవరిని మోసం చేస్తారు.. ఆ సినిమాను మక్కీకి మక్కీ దించి.. ఒరిజినల్ అంటారేంటి

Big Stories

×