UP News: సోషల్‌మీడియా వల్ల మంచి-చెడు రెండూ ఉంటాయి. దాన్ని ఉపయోగించుకునే పద్దతి అలాగే ఉంటుంది. తేడా వస్తే అడ్డంగా దొరికిపోతాము కూడా. ఆ వ్యక్తి విషయంలో అదే జరిగింది. భార్య గర్భంతో ఉన్నపుడు మిస్సయ్యాడు. ఎక్కడున్నాడో, ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. భార్యపై రకరకాలుగా అనుమానం పడ్డారు. అవేమీ పట్టించుకోలేదు ఆమె. ఏడేళ్ల తర్వాత ఇన్‌స్టా రీల్ ద్వారా భర్త ఆచూకీ లభించింది. ఆసక్తికరమైన ఈ ఘటన యూపీలో వెలుగుచూసింది.
యూపీలోని సందీలాలోని మురార్ నగర్ ప్రాంతానికి జితేంద్ర కుమార్ 2017లో షీలూతో వివాహం జరిగింది. జితేంద్రను ఆ ఊర్లో ముద్దుగా బబ్లూ అని పిలిచేవారు. పెళ్లయిన ఏడాదికి షీలూ గర్భవతి అయ్యింది. 2018 ఏడాది చివరలో జితేంద్ర కనిపించకుండా పోయాడు.
షీలు తీసుకొచ్చిన కట్నం, బంగారం కోసం వేధించాడని ఆ డిమాండ్లు నెరవేరకపోవడం తో భర్తను ఆమె ఇంటి నుండి గెంటేశారని ఆరోపించారు. దీని తర్వాత వరకట్నం వేధింపుల కింద షీలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో జితేంద్ర అదృశ్యమయ్యాడు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కానీ ఫలితం లేకుండాపోయింది.
ఆధారాలు లేకపోవడంతో జితేంద్ర కుటుంబం షీలు- ఆమె కుటుంబసభ్యులపై దుమ్మెత్తిపోశారు. జితేంద్రను చంపి, మృతదేహాన్ని అదృశ్యం చేశారని ఆరోపించారు. చివరకు జితేంద్ర కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భర్త కేసులో షీలు నిందితురాలిగా ఉంది. పుట్టిన కొడుకుని ఒంటరిగా పెంచుతోంది. భర్తను చంపిన మహిళంటూ వేధించడం ఊరిలో వాళ్లు మొదలుపెట్టారు.
ALSO READ: ఇన్‌స్టా పరిచయం.. వయస్సు దాచిన మహిళ, చివరకు ఏం జరిగింది?
నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత జితేంద్రం ఆచూకీ బట్టబయలైంది. కొద్దిరోజుల కిందట షీలు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తోంది. అందులో సడన్‌గా భర్త పోలికలతో ఉన్న వీడియో కనిపించింది. ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి వీడియోలు పరిశీలించి షీలుకి ఊహించని షాక్ తగిలింది.
అతడు ఎవరోకాదని, కనిపించకుండా పోయిన ఆమె భర్త బబ్లూ అని అంచనాకు వచ్చేసింది. బబ్లూ పక్కనే ఓ మహిళ క్లోజ్‌గా ఉంది. వెంటనే షీలు ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తెచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు, పూర్తిస్థాయిలో విచారణ మొదలుపెట్టారు.
చివరకు అతడు బబ్లూ అని గుర్తించారు. బబ్లూతో ఉన్నది రెండో భార్యని తేలింది. షీలు నుంచి పారిపోయిన తర్వాత బబ్లూ పంజాబ్‌లో సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టాడు. అక్కడ మరో మహిళను పెళ్లి చేసుకుని లుథియానాలో సెటిల్ అయ్యాడు. చివరకు పోలీసులు లుథియానా వెళ్లి బబ్లూను అరెస్ట్ చేశారు.
Husband missing for 7 years, found on reels😱
A man from Atamau who went missing 7 years ago, leaving behind his wife & son, has now been spotted making reels with another woman in Ludhiana.
Back then, his father accused the in-laws of killing him, while the wife waited at her… pic.twitter.com/3qTT1fx36u
— ShoneeKapoor (@ShoneeKapoor) August 31, 2025