Bigg Boss 9: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గురించి ఇప్పుడు ఎక్కడ చూసిన టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా 9 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టగా.. మరొక ఆరు మంది కామనర్స్ అగ్నిపరీక్ష షోలో తమ టాలెంటును నిరూపించుకొని.. హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక వీరంతా కూడా ఎవరికి వారు తమ ఆట తీరుతో ఆకట్టుకున్నారు. మధ్యలో దివ్య నిఖిత హౌస్ లోకి అడుగుపెట్టగా.. వైల్డ్ కార్డు ద్వారా 6 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి వచ్చారు. దీనికి తోడు ఎలిమినేషన్ లో భాగంగా బయటకు వెళ్లిపోయిన భరణి శంకర్ మళ్లీ హౌస్ లోకి వచ్చి తన ఆటను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గత వారం ఇద్దరు ఎలిమినేట్ కాగా ఈవారం ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మరి ఈరోజు జరిగిన నామినేషన్స్ లో ఎవరు నామినేషన్ లోకి వచ్చారు అనే విషయం వైరల్ గా మారుతోంది. మరి ఈ వారం నామినేషన్స్ లో నిలిచిన ఆ కంటెస్టెంట్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
64వ రోజుకు సంబంధించిన రెండు ప్రోమోలను విడుదల చేయగా.. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ వారం నామినేషన్స్లోకి నిఖిల్, గౌరవ్, సంజన, రీతు, భరణి, దివ్య వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా 6 మంది ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చేసారు. మరి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ వారం దివ్య ఎలిమినేట్ కానుంది అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే .మరి వీకెండ్ వరకు ఎవరు ఎలిమినేట్ అవుతారు అధికారికంగా తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.
ఇకపోతే 9 వారాలకు గానూ ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ , మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ, సాయి శ్రీనివాస్, రాము రాథోడ్, భరణీ శంకర్ , ఆయేషా జీనత్, దివ్వెల మాధురి, రమ్య మోక్ష వీరంతా ఎలిమినేట్ అయ్యారు. కానీ భరణి శంకర్ మళ్లీ హౌస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.
ALSO READ:Bigg Boss 9 Promo : ఫుడ్‌పై ఉన్న ఫోకస్ గేమ్‌పై లేదు… గౌరవ్‌ను గజగజ వణికించారు.!
ఇకపోతే బిగ్ బాస్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు ఇమ్మానుయేల్. ఇప్పటివరకు 10 వారాలు పూర్తికాగా కనీసం ఒక్క వారం కూడా ఆయన నామినేషన్స్లోకి రాకపోవడం గమనార్హం. అంతేకాదు హౌస్ కి రెండు సార్లు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.