E-Paper
Advertisement

గ్లామర్ డోస్ పెంచేసిన శివానీ నాగరం..ఫొటోషూట్‌లో అదరగొట్టేసిందిగా!

గ్లామర్ డోస్ పెంచేసిన శివానీ నాగరం..ఫొటోషూట్‌లో అదరగొట్టేసిందిగా!
Advertisement

Shivani Nagaram:శివానీ నాగరం ..లిటిల్ స్టార్స్ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు ఇపుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఒక వైపు నటిగా సత్తా చాటుతూనే ఎప్పటికప్పుడు కొత్త ఫొటోషూట్లతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది.

ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు ఇపుడు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి.ఇక ఈ ఫొటోల విషయానికి వస్తే డార్క్ పర్పుల్ కలర్ శాటిన్ టాప్‌లో క్లాసీగా కనిపిస్తూ అభిమానులని తనవైపు తిప్పేసుకుంది ఈ అందాల భామ .

Advertisement

పైగా దానికి మ్యాచింగ్‌గా బ్లాక్ ట్రౌజర్స్ వేసుకుని ఆ లుక్‌కు మరింత స్టైలిష్ టచ్ ఇవ్వడంతో అందం కాస్త డబల్ అయిందని చెప్పాలి. ఇక నడుముకు బ్లాక్ బెల్ట్, కళ్లకు పెద్ద సైజు బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకుని కనిపించిన తీరు నెక్స్ట్ లెవెల్.పైగా ఈ ఫోటోలకి శివానీ పెట్టిన క్యాప్షన్ అభిమానులని ఫిదా చేస్తుంది. “The Baddie has clocked out” అంటూ పెట్టిన ఈ పోస్ట్ కి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్ .

ఇక శివానీ నాగరం కెరీర్ విషయానికి వస్తే.. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మౌళి హీరోగా వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ఒక్కసారిగా ఈ భామ కెరీర్ ని మలుపుతిప్పేసింది.అందులో కాత్యాయణిగా నటించి యూత్‌ను ఫిదా చేసింది.

Advertisement

అలాగే సుహాస్‌తో మరోసారి‘హే బల్‌వంత్’ సినిమాలో తళుక్కుమంది. అలాగే ‘ఆరంభం’ సినిమాలో పాట కూడా పాడి సింగర్ గా తన టాలెంట్ ని చూపించింది.
మొత్తానికి ఒకవైపు సినిమాలలో వరుసగా మంచి మంచి రోల్స్ దక్కించుకుంటున్న ఈ అమ్మడు ఇపుడు సోషల్ మీడియాలోనూ బిజీ అయిపొయింది.

ALSO READ:జీవా, శ్రీహరి స్నేహం వెనుక ఇంత కథ ఉందా? బాలచందర్ ఎమోషనల్ కామెంట్స్!

ఈ క్రమంలోనే వరుస అప్ డేట్స్ ని అభిమానులతో షేర్ చేస్తున్న అమ్మడు తాజాగా పర్పుల్ అండ్ బ్లాక్ కాంబినేషన్ పిక్స్ షేర్ చేసి మరోసారి మీడియాలో హైలెట్ అయ్యింది.చూడాలి మరి ఒకవైపు నెట్టింట మంటలు పెడుతూ ,మరోవైపు కెరీర్ లో ఊసుకుపోతున్న ఈ అందాల భామ ముందు ముందు ఎలాంటి సినిమాలతో సత్తా చాటుతుందో !

Tags

Related News

నాని మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడా.. ?

జీవా, శ్రీహరి స్నేహం వెనుక ఇంత కథ ఉందా? బాలచందర్ ఎమోషనల్ కామెంట్స్!

బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘దాదా’ రిలీజ్ డేట్‌పై ఫుల్ క్లారిటీ!

తొడలు కొట్టడం, ఛాలెంజ్‌లు చేయడం.. ఈవెంట్లకు వెళ్లాలంటేనే భయమేస్తోంది.. బోయపాటి శ్రీను!

థియేటర్‌కు వెళ్లాక సీన్లు తీసేస్తే మా పరువు పోయినట్టే.. సీనియర్ ఎడిటర్ వైరల్ కామెంట్స్!

IFFI 2026 రెడ్ కార్పెట్‌పై కేథరిన్ ట్రెసా మెరుపులు.. ఈ క్లాసీ లుక్ చూశారా?

1200 సినిమాలు.. 50 ఏళ్ల ప్రయాణం.. నాన్న కష్టాల గురించి బయటపెట్టిన జీవా కొడుకు!

Big Stories

Advertisement
×