E-Paper
Advertisement

రూ. 500 గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ!

రూ. 500 గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ!
Advertisement

Maha Lakshmi: రాష్ట్రంలో ‘మహాలక్ష్మి’ పథకం కింద రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్ పొందే లబ్ధిదారులకు ఆధార్ గుర్తింపును తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు (జీవో నం.19) జారీ చేసింది. పథకం ప్రయోజనాలు నిజమైన అర్హులకే నేరుగా చేరాలనే ఉద్దేశంతో ఆధార్ చట్టం–2016లోని సెక్షన్ 7 ప్రకారం పౌరసరఫరాల శాఖ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆధార్ ఆధారంగా..

తెల్ల రేషన్ కార్డు (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) ఉండి, ప్రజాపాలన ద్వారా ఎంపికైన లబ్ధిదారులు ఆధార్ నంబర్‌ సమర్పించాలి లేదా ఆధార్ ధ్రువీకరణ (అథెంటికేషన్) చేయించుకోవాలని, ఆయిల్ కంపెనీల వద్ద ఉన్న గ్యాస్ కనెక్షన్ వివరాలను, పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న రేషన్ కార్డు వివరాలను ఆధార్ ఆధారంగా అనుసంధానిస్తారు. సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం ముందుగానే ఆయిల్ కంపెనీలకు చెల్లిస్తుందని, అవి డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాయని పేర్కొంది.ఆధార్ నమోదు చేసుకోని వారు తక్షణమే సమీపంలోని ఆధార్ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి.

సాంకేతిక కారణాలు..

Advertisement

ఆధార్ వచ్చే వరకు.. ఎన్‌రోల్‌మెంట్ స్లిప్‌తో పాటు రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి హామీ కార్డు వంటి గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి చూపించి సబ్సిడీ పొందవచ్చు. బయోమెట్రిక్ వేలిముద్రలు సరిగ్గా పడని వారికి ఐరిస్ స్కాన్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ధ్రువీకరిస్తారు. ఇవి కూడా సాధ్యం కాకపోతే ఆధార్ ఓటీపీ ద్వారా, చివరి ప్రయత్నంగా ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లబ్ధిదారులను గుర్తిస్తారు. సాంకేతిక కారణాలతో అర్హులైన ఏ ఒక్కరికీ సబ్సిడీ ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఈ ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించినట్లు పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి వై.నాగిరెడ్డి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Also Read: దొంగ పత్రాలతో ఆస్తి విడిపించడంలో ఇతడు దిట్ట.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

Tags

Related News

మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు కుట్ర కలకలం

డీలిమిటేషన్‌ ప్రక్రియపై రాంచందర్ రావు కీలక ప్రకటన!

సృష్టి కేసులో డాక్టర్ నమ్రతకు బిగ్ షాక్.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు!

దొంగ పత్రాలతో ఆస్తి విడిపించడంలో ఇతడు దిట్ట.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్‌గా పరిచయం.. టెకీకి రూ. 10.05 లక్షల టోకరా!

కల్వకుంట్ల కవిత చుట్టూ బ్రోకర్లు చేరారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన షకీల్!

ఇన్వెస్ట్‌ తెలంగాణ సమ్మిట్‌–2026లో కీలక మార్పులు.. 10 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం!

Big Stories

Advertisement
×