Catherine Tresa:కేథరిన్ ట్రెసా..టాలీవుడ్‌లో అందంతో పాటు తన నటనతో ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించిన ఈ అందాల భామ మరోసారి సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ చేస్తుంది.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా అప్ డేట్స్ ని మాత్రం ఎప్పుడూ ఫాలోవర్స్ తో పంచుకోవడం లో లేట్ చేయనంటుంది.ఇదిగో ఈ క్రమంలో ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో మంటలు పెట్టేస్తున్నాయి.
ముఖ్యంగా ఆమె వేసుకున్న బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పుడు అందరిని ఫిదా చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోలకి ‘Letting the breeze do the styling ‘ అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టడం విశేషం. ఇక ఫొటోల్లో బ్లాక్ కలర్ స్ట్రాప్‌లెస్ టాప్, వైట్ కలర్ స్కర్ట్‌లో కేథరిన్ చాలా క్లాసీగా కనిపిస్తుంది అనడం లో సందేహం లేదు.
మెడలో చోకర్ లాంటి జ్యువెలరీ, చేతికి బ్రేస్‌లెట్లు, చెవులకు ఇయర్ రింగ్స్‌తో పాటు న్యాచురల్‌గా వదిలేసిన హెయిర్, మేకప్ కూడా ఆమె అందాన్ని డబల్ చేసిందనే చెప్పాలి.ఇకపోతే ఈ ఫొటోలకు మరో స్పెషాలిటీ కూడా ఉందండోయ్ ..
అవును .. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2026)లో భాగంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా స్క్రీనింగ్‌కు వెళ్ళింది కేథరిన్.ఆ సందర్బంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ భామ.
ఇక సినిమాల విషయానికి వస్తే కేథరిన్ ట్రెసాకు తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయిన ఈ అమ్మడు ‘పైసా’లో తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది.ఇక గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి’లో అనామిక క్యారెక్టర్‌లో కనిపించి ఆడియన్స్ నుండి మంచి అప్లాజ్ మూటగట్టుకుంది.
ముఖ్యంగా అల్లు అర్జున్‌తో కలిసి నటించిన ‘సరైనోడు’ సినిమాలో ఆమె పాత్ర అప్పట్లో బన్నీ ఫ్యాన్స్ ని బాగా అలరించింది.ఇక ఆ తర్వాత ‘గౌతమ్ నంద’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘జయ జానకి నాయక’ లాంటి సినిమాలతో తన కెరీర్ ని కంటిన్యు చేసింది ఈ అమ్మడు.మొత్తంగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది క్యాథరీన్ .
ఇలా ఒకవైపు సినిమాలతో సందడి చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో వరుస అప్ డేట్స్ తో ఫ్యాన్స్‌ను పలకరించడం క్యాథరీన్ స్పెషాలిటీ.సో ఆ క్రమంలోనే .ఇప్పుడు ఈ బ్లాక్ అండ్ వైట్ లుక్‌తో మరోసారి సోషల్ మీడియాలో మంటలు పెట్టె పనిలో పడింది ఈ ముద్దు గుమ్మ !
also read:1200 సినిమాలు.. 50 ఏళ్ల ప్రయాణం.. నాన్న కష్టాల గురించి బయటపెట్టిన జీవా కొడుకు!