E-Paper
Advertisement

1200 సినిమాలు.. 50 ఏళ్ల ప్రయాణం.. నాన్న కష్టాల గురించి బయటపెట్టిన జీవా కొడుకు!

1200 సినిమాలు.. 50 ఏళ్ల ప్రయాణం.. నాన్న కష్టాల గురించి బయటపెట్టిన జీవా  కొడుకు!
Advertisement

Jeeva Balachandra:జీవా..తెలుగు ఆడియన్స్ ని కళ్ళతోనే భయపెట్టిన ఈ వెర్సటైల్ విలన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ముఖ్యంగా విలన్ పాత్రల్లో ఆయన ఇచ్చే ఫెర్మామెన్స్ ఇప్పటికీ ఆడియన్స్‌కు గుర్తుండిపోతుంది.

అలా ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో పవర్‌ఫుల్ విలన్‌గా మెప్పించిన జీవా, ఆ తర్వాత ఎన్నో రకాల పాత్రల్లో నటించి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారని చెప్పక్కర్లేదు.ఇక జీవా ప్రస్తుతం సినిమాలలో స్పీడ్ తగ్గించగా ఆయన కొడుకు జీవా బాలచంద్ర ఇండస్ట్రీలో తన ముద్ర వేయడానికి రెడీ అయిపోయాడు.ఈ సందర్బంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చాడు.ముఖ్యంగా తన తండ్రి సినీ జర్నీ, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఎదుర్కొన్న కష్టాలని ఇలా చెప్పుకొచ్చాడు.

Advertisement

ఈ సందర్బంగా బాలచంద్ర మాట్లాడుతూ జీవా కి మొదట్లో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ బాలచందర్ అంటే ఎంతో గౌరవం అని అందుకే తనకి ఆయన పేరు వచ్చేలా బాలచంద్ర అని పేరు పెట్టుకున్నాడని చెప్పుకొచ్చాడు.ఒకవేళ అమ్మాయి పుట్టి ఉంటే బాలచంద్రిక అని పేరు పెట్టేవాడినని కూడా జీవా అనే వాడని తెలిపాడు .

ఇక తన పేరులో తండ్రి పేరు కూడా ఉండేలా ఈమధ్యనే జీవా బాలచంద్రగా మార్చుకున్నానని, అయితే డైరెక్టర్ బాలచందర్‌ను నేరుగా కలవలేకపోయాననే చిన్న బాధ మాత్రం తనకు ఎప్పటికీ ఉంటుందని చెప్పారు.

Advertisement

ఇక సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి తాను మొదటి నుంచి ట్రై చేశానని,. తనకు యాక్టింగ్‌తో పాటు డైరెక్షన్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందన్నాడు.ఇక రీసెంట్‌గా ‘అహ నా పెళ్లంట’ అనే వెబ్‌సిరీస్‌కు డైరెక్షన్ చేశానని, దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాడు .అయితే డైరెక్షన్ వైపు వెళ్లాలని అనుకున్న టైమ్‌లో మళ్లీ యాక్టర్‌గా అవకాశాలు రావడంతో ఆర్టిస్ట్‌గా కంటిన్యూ అవుతున్నట్లు వివరించాడు.

ఇక తన తండ్రి గురించి చెబుతూ.. జీవా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 50 ఏళ్లు పూర్తయ్యాయని, ఆయన 1200కు పైగా సినిమాల్లో నటించారని వివరించాడు.తన తండ్రి కెరీర్‌లో ఎన్నో కష్టాలు ఉన్నాయని, ముఖ్యంగా ఆయన లుక్ చూసి కొంతమంది తప్పుగా అర్థం చేసుకునేవారని చెపుకొచ్చాడు.

తాగి షూటింగ్‌కు వస్తారేమోనని కొందరు అనుకునేవారని, కానీ నిజానికి తన తండ్రి ఎప్పుడూ తాగి షూటింగ్‌కు వెళ్లలేదని క్లారిటీ ఇచ్చాడు . ఎవరైనా అలాంటి కామెంట్స్ చేస్తే తనకు చాలా బాధగా అనిపించేదని వాపోయాడు..ఇక తన నాన్న చాలా సింపుల్ పర్సన్ అని, డబ్బు కోసం ఎప్పుడూ పాకులాడరని తెలిపాడు బాలచంద్ర.

సినిమాలు ఉన్నప్పుడు చేసేవారని, అవకాశాలు లేనప్పుడు కూడా ఎవరి దగ్గరికీ వెళ్లి పని అడిగేవారు కాదని చెప్పుకొచ్చాడు. అయితే ఫైనాన్షియల్ గా కుటుంబాన్ని నిలబెట్టడంలో తన తల్లి ఎంతో సపోర్ట్ చేశారని, ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ అని , లైబ్రేరియన్‌గా పనిచేస్తూ ఫ్యామిలీ ని బాగా నెట్టుకొచ్చేవారని గుర్తు చేసుకున్నారు.

అలాగే చెన్నైలో జీవా, శ్రీహరి కలిసి. ఎన్నో కష్టాలు పడ్డారని , శ్రీహరి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కూడా జీవా పట్ల ఎంతో ప్రేమ చూపించారని, ఆయన చనిపోయినప్పుడు తన తండ్రి చాలా బాధపడ్డారని ఎమోషనల్ అయ్యాడు.

ఇక తన తండ్రి ఎలాంటి సిట్యుయేషన్‌లోనూ భయపడడని అదే తనకి నచ్చుతుందని తెలిపాడు.చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తన తండ్రిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలని, ఆయన ఆలోచనే తనకు కొండంత బలాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చాడు బాలచంద్ర.చూడాలి మరి సినిమాలలో సత్తా చాటాలని ఆశ పడుతున్న బాల చంద్ర తండ్రి పేరు ఏ మేరకి నిలబెడతాడో !

also read:రాము రాథోడ్, లిఖిత కాంబోలో టాప్ 5 సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్!

Tags

Related News

కార్తీకదీపం సీరియల్ నటుడు “ఓ టార్చర్ ప్రేమ” సినిమా టీజర్ లాంఛ్

క్రిస్మస్‌కు ముందే హీట్ పెంచిన సాయి మంజ్రేకర్.. గ్రీన్ డ్రెస్‌లో అదిరిపోయే అందాలు!

అవకాశాలు వస్తున్న రిజెక్ట్ చేస్తున్న సుధాకర్.. అసలు కారణం బయట పెట్టిన కొడుకు!

37 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి!

డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి బయటపెట్టిన అనిల్ రావిపూడి.. కామెడీకి బ్రేక్ పడినట్లేనా?

ఇడుపు కాయితం’ నుంచి మరో మెలోడీ.. పాట వింటే ఫిదా అవ్వాల్సిందే!

వృషకర్మ 100 కోట్ల కలెక్షన్స్ పక్కా… అంత కాన్ఫిడెన్స్ ఏంటీ బ్రో..

Big Stories

Advertisement
×