E-Paper
Advertisement

థియేటర్‌కు వెళ్లాక సీన్లు తీసేస్తే మా పరువు పోయినట్టే.. సీనియర్ ఎడిటర్ వైరల్ కామెంట్స్!

థియేటర్‌కు వెళ్లాక సీన్లు తీసేస్తే మా పరువు పోయినట్టే.. సీనియర్ ఎడిటర్ వైరల్ కామెంట్స్!
Advertisement

Marthand K Venkatesh:తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయన్నా సంగతి తెల్సిందే.సినిమాకి శిల్పులై చెక్కే ఎడిటర్ గురించి మాత్రం చాలా తక్కువగా మాట్లాడుకుంటాం.అలా ఎన్నో సినిమాలని ఒంటి చేత్తో ఫలితాలని తారుమారు చేసిన ప్రముఖ ఎడిటర్ లలో మార్తాండ్ కె. వెంకటేష్ ఒకరు.ఇక ఈయన  ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు.

మొదట్లో తాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు యాభై వంద సినిమాలు చేస్తే చాలనుకున్నానని, కానీ ఇప్పుడు దాదాపు ఐదు వందల సినిమాలకు దగ్గరగా రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎడిటింగ్ తనకు కేవలం ఒక పని కాదని, తనకు అన్నం పెట్టిన వృత్తి అని, ఈ జర్నీతో పూర్తి సంతృప్తిగా ఉన్నానని అన్నారు.

Advertisement

ఇక ఇన్నేళ్ల కెరీర్‌లో ఇష్టమైన హీరో ఎవరు లేరని ,ఎడిటర్‌గా ఏ ఒక్క హీరో మీదా స్పెషల్ గా అభిమానం ఉండకూడదని క్లారిటీ ఇచ్చారు.ఏ సినిమా చేసినా ఆ టీమ్‌తో, ఆ కథతో కలిసిపోతామని, సొంత ఇష్టాల కంటే సినిమా బాగుండటమే ముఖ్యమని చెప్పారు.

ఇక ఒక సినిమా నాకు బాగా నచ్చి, ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనిపిస్తే దర్శకుడితోనైనా, నిర్మాతతోనైనా వాదిస్తానని అన్నారు. అనవసరంగా మార్పు చేర్పులు చేసి మంచి సినిమాని దెబ్బతినే పరిస్థితి వస్తే మాత్రం తప్పకుండా అడ్డుకుంటానని కుండ బద్దలు కొట్టేశారు..

Advertisement

ఇక సినిమా రిలీజ్ అయ్యాక రెస్పాన్స్ చూసి మళ్లీ కట్ చేయడం, సీన్లు కలపడం కంటే, థియేటర్‌లోకి వెళ్లే ముందే అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం ఎడిటింగ్ టీమ్ బాధ్యత అని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు

ఒక వేళ సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ ట్రిమ్ చేయాల్సి వస్తే తమ విభాగం ఎక్కడో తడబడినట్టేనని అన్నారు. లాగ్ ఉందనే సాకుతో కథ అర్థం కావడానికి అవసరమైన సీన్లు తీసేయకూడదని, ఆ సీన్ ఎందుకు ముఖ్యమో చెప్పేవాళ్లకు వివరించాల్సి వస్తుందని చెప్పారు.

ఇక పాత రోజుల్లో చేత్తో ఫిలిం పట్టుకుని కట్ చేసేవాళ్లమని, చిన్న మార్పుకైనా మళ్లీ ప్రింట్ తీసుకోవాల్సి వచ్చేదని గుర్తుచేసుకున్నారు. తర్వాత స్టీన్‌బెక్, ఆపై ఆవిడ్, కంప్యూటర్ టెక్నాలజీ రావడంతో సినిమా ఎడిటింగ్ తీరు పూర్తిగా మారిపోయిందని చెప్పారు. టెక్నాలజీ మారినప్పుడల్లా కొత్త విషయాలు నేర్చుకున్నామని, సురేష్ ప్రొడక్షన్స్‌లో ముందుగానే కొత్త టెక్నాలజీ తెచ్చి సురేష్ బాబు ఎడిటర్లకు నేర్పించేవారని మెచ్చుకున్నారు.

ఇక రీమేక్ సినిమాల గురించి మాట్లాడుతూ అవి చేయడం ఇంకా కష్టమని ,. వేరే భాషలో హిట్ అయిన సినిమాను తెలుగులోకి తీసుకొచ్చేటప్పుడు ఒరిజినల్ ఫీల్ పోకుండా, మన ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా మార్పులు చేయాల్సి ఉంటుందని, చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా దృశ్యం లాంటి సినిమాలకు కట్స్ చాలా ముఖ్యమని చెప్పారు. కొన్నిసార్లు రెండు క్లైమాక్స్‌లు తీస్తే ఏది బాగా కనెక్ట్ అవుతుందో డిస్కస్ చేసి నిర్ణయిస్తామని తెలిపారు. ఇక కమర్షియల్ సినిమాలతో పాటు సమ్మోహనం, గీతాంజలి లాంటి ఫీల్ గుడ్ సినిమాలు అంటే చాలా ఇష్టమని చెప్పారు.

చివరగా తన దగ్గర పనిచేసే వాళ్లకు ఒక విజయం రాగానే విలాసాలకు అలవాటు పడొద్దని, ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, ఇవాళ పలకరించిన వాళ్లు రేపు పట్టించుకోకపోవచ్చని వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని సలహా ఇచ్చారు ఈ సీనియర్ స్టార్ ఎడిటర్ .

also read:IFFI 2026 రెడ్ కార్పెట్‌పై కేథరిన్ ట్రెసా మెరుపులు.. ఈ క్లాసీ లుక్ చూశారా?

Tags

Related News

IFFI 2026 రెడ్ కార్పెట్‌పై కేథరిన్ ట్రెసా మెరుపులు.. ఈ క్లాసీ లుక్ చూశారా?

1200 సినిమాలు.. 50 ఏళ్ల ప్రయాణం.. నాన్న కష్టాల గురించి బయటపెట్టిన జీవా కొడుకు!

కార్తీకదీపం సీరియల్ నటుడు “ఓ టార్చర్ ప్రేమ” సినిమా టీజర్ లాంఛ్

క్రిస్మస్‌కు ముందే హీట్ పెంచిన సాయి మంజ్రేకర్.. గ్రీన్ డ్రెస్‌లో అదిరిపోయే అందాలు!

అవకాశాలు వస్తున్న రిజెక్ట్ చేస్తున్న సుధాకర్.. అసలు కారణం బయట పెట్టిన కొడుకు!

37 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి!

డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి బయటపెట్టిన అనిల్ రావిపూడి.. కామెడీకి బ్రేక్ పడినట్లేనా?

Big Stories

Advertisement
×