Dada Movie:గత కొన్ని రోజులుగా సినిమాలు ఏవి ఎప్పుడు వస్తాయో ..ఏవి వాయిదాల పాట పాడుతాయో తెలీని పరిస్థితి.ఇక ఈ క్రమంలో బాలయ్య నటిస్తున్న దాదా కూడా చెప్పినట్టుగా డిసెంబర్ 24నే వస్తుందా లేక పొంగల్ వైపు దిక్కులు చూస్తుందా అంటూ డౌట్స్ రైజ్ చేశారు మూవీ లవర్స్ .అయితే తాజాగా క్రేజీ అప్ డేట్ తో మరోసారి కుండ బద్దలు కొట్టేసాడు బాలయ్య .
నిజానికి ‘దాదా’ సినిమాను ముందుగా అనుకున్నట్టుగా షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్ 24న ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేశారు పైగా క్రిస్మస్ హాలిడేస్ కలిసివస్తాయని అప్పుడే ట్రేడ్ వర్గాలు లెక్కలు కూడా మొదలెట్టేశాయి.
అయితే సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తికాలేదని, అందుకే మేకర్స్ ఈసారి వాయిదాల పాట పాడే అవకాశం ఉందని ఫిక్స్ అయ్యారు అంతా.ఇక ఎప్పటిలాగే సినిమాని పొంగల్ బరిలో ఇచ్చాం ఖాయమని అప్పుడు రావాల్సిన సాయి ధరమ్ తేజ్ సినిమా ‘సంబరాల ఏటి గట్టు’ స్థానంలో బాలయ్య ‘దాదా’ వచ్చే అవకాశముందని సోషల్ మీడియా ఊదరగొట్టేసింది.
దీంతో అసలు సినిమా క్రిస్మస్‌కు వస్తుందా? లేక సంక్రాంతికి షిఫ్ట్ అవుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే దీంతో డైలామాకి చెక్ పెడుతూ మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ అప్ డేట్ వదిలారు.
బాలకృష్ణ ఫింగర్ చూపిస్తున్న ‘దాదా’ గ్లింప్స్‌లోని క్లిప్‌ను కోట్ చేస్తూ డిసెంబర్ 24నే సినిమా థియేటర్లలోకి వస్తుందని కుండ బద్దలు కొట్టేశారు.ఒకరకంగా చెప్పాలంటే అభిమానుల డైలామాకి ఈ అనౌన్స్ మెంట్ ఫుల్‌స్టాప్ పెట్టినట్లే.
నిజానికి నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానుల్లో హడావుడి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.అందులోనూ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమా అయితే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ప్రస్తుతం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఈ ‘దాదా’ కూడా ఒకటి.
బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం.ఇక వీర సింహారెడ్డి వంటి సాలిడ్ హిట్ అందించిన గోపీచంద్ మలినేని ఈ సినిమాకి డైరెక్టర్ కావడంతో మొదటి నుంచే ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడింది.
ఇక ఈ సినిమాలో ముఖ్యంగా బాలయ్య, మంచు మనోజ్ మధ్య వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవెల్ అని ఇన్ సైడ్ టాక్ .పైగాఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండటం కూడా అంచనాల్ని పెంచేస్తుంది .బాలయ్య సినిమాలు అంటే థమన్ ఊగిపోతాడని గత సినిమాలు ప్రూవ్ చేశాయి కూడా.
also read:తొడలు కొట్టడం, ఛాలెంజ్‌లు చేయడం.. ఈవెంట్లకు వెళ్లాలంటేనే భయమేస్తోంది.. బోయపాటి శ్రీను!
మొత్తానికి రిలీజ్ డేట్ మారుతుందని ఊదరగొట్టిన వారికి సరైన పంచ్ ఇచ్చేశాడు బాలయ్య .మరి భారీ అంచనాలు మోస్తున్న బాలయ్య అభిమానులకి ఎలాంటి మెమరబుల్ గిఫ్ట్ ఇస్తాడో డిసెంబర్ 24న చూడాలి .
DECEMBER 24th…..🎯🎯🎯
షెహరంతా అదిరిపోవాలి….
బాక్సాఫీస్ బద్దలైపోవాలి…#DADA pic.twitter.com/QM1VNWxHJ8— DADA (@NBKisDADA) November 28, 2026