E-Paper
Advertisement

మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు కుట్ర కలకలం

మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్యకు కుట్ర కలకలం
Advertisement

Baba Fasiuddin: జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్.. బోరబండ డివిజన్ మాజీ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌ ను హత్య చేసేందుకు పన్నిన కుట్రను బోరబండ పోలీసులు గంటల వ్యవధిలోనే భగ్నం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బోరబండ స్వరాజ్ నగర్‌ కు చెందిన ఇమ్రాన్, అతని సోదరుడు ఫయాజ్ కలిసి దాదాపు నెల రోజుల క్రితం బోరబండకు చెందిన మిస్బా అనే వ్యక్తిని కలిసి బాబా ఫసియుద్దీన్‌ ను హత్య చెయ్యాలని చెప్పారు.

ఇంటి వద్ద రెక్కీ..

తాము చెప్పినట్టు చేస్తే 25 లక్షలు సుపారీగా ఇస్తామన్నారు. అడ్వాన్స్‌ గా 5 లక్షలు ఇచ్చారు. దీనికి ఒప్పుకున్న మిస్బా తన గ్యాంగ్ సభ్యులతో కలిసి బాబా ఫసియుద్దీన్‌ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడు. అతని కదలికలపై నిఘా పెట్టాడు. అనుమానం వచ్చి బాబా ఫసియుద్దీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ఇమ్రాన్, అతని సోదరుడు ఫయాజ్, రాజు తదితరులపై కేసులు నమోదు చేశారు. ఆ వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. కుట్ర వెనుక ఉన్న సూత్రధారులు, ఆర్థిక సహాయం అందించిన వారు, ఇతర సహచరులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

పక్కాగా సమాచారం..

Advertisement

ఈ బృందాలు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి సాంకేతిక ఆధారాలను సేకరించారు. ప్రాణహాని ఉన్న నేపథ్యంలో బాధితుడికి అవసరమైన భద్రతను కల్పించారు. పక్కాగా సమాచారం సేకరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రెక్కీ నిర్వహించే సమయంలో ఉపయోగించిన 2 కత్తులు, కుట్ర సమయంలో సంభాషణల కోసం వాడిన 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయినవారిలో బోరబండకు చెందిన ఇమ్రాన్ ఖాన్ (33), దేవర రాజా (56), సయ్యద్ హాది, ఫయాజ్ ఖాన్ (38), మహమ్మద్ కాషిఫ్ మిస్బా (26), షేక్ నవాజ్ (32) ఉన్నారు.

Also read: భారత దేశం చాలా గొప్పది.. పాక్ ప్లేయర్లకు అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు

Tags

Related News

డీలిమిటేషన్‌ ప్రక్రియపై రాంచందర్ రావు కీలక ప్రకటన!

సృష్టి కేసులో డాక్టర్ నమ్రతకు బిగ్ షాక్.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు!

దొంగ పత్రాలతో ఆస్తి విడిపించడంలో ఇతడు దిట్ట.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్‌గా పరిచయం.. టెకీకి రూ. 10.05 లక్షల టోకరా!

కల్వకుంట్ల కవిత చుట్టూ బ్రోకర్లు చేరారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన షకీల్!

ఇన్వెస్ట్‌ తెలంగాణ సమ్మిట్‌–2026లో కీలక మార్పులు.. 10 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం!

ఎల్‌నినో ముప్పుకు చెక్.. తెలంగాణ సర్కారు రూ.10 వేల కోట్ల మెగా ప్లాన్ ఇదే!

Big Stories

Advertisement
×