Jeeva Balachandra:ఆయన విలన్‌గా కనిపిస్తే చాలు.. ముఖ్యంగా ఆయన కళ్లతో చూసే చూపుకే ప్రేక్షకులు భయపడిపోయేవారు. ఇక పెద్ద డైలాగ్స్ చెప్పకుండానే సీన్ ని సీరియస్ చేసి ఆడియన్స్ లో కోపాన్ని రగిల్చేవాడు .ఆయనే వెర్సటైల్ యాక్టర్ జీవా.
ఇక వయసు మీద పడటంతో ప్రస్తుతం ఆయన సినిమాల్లో స్పీడ్ తగ్గించాడు.అయితే ఆయన కొడుకు జీవా బాలచందర్ ఇండస్ట్రీ లో తండ్రి అడుగుజాడల్లో నడిచేందుకు రెడీ అయిపోయాడు.ఇక ఈ సందర్బంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలని ఇలా చెప్పుకొచ్చాడు .
మాములుగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి. అవకాశాల కోసం ఎదురుచూడాలి. కానీ జీవా విషయంలో మాత్రం ఇదంతా జరగలేదని చెప్పుకొచ్చాడు. ఆయనకు అప్పట్లో గుంటూరులో మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండేదని ఆ స్నేహితుల్లో గుంటూరు శాస్త్రి అనే వ్యక్తి తన తండ్రి ఫొటోను చెన్నైలో జరుగుతున్న ఆడిషన్స్‌కు పంపించారని గుర్తుచేసుకున్నాడు.
ఆ ఫొటోను చూసిన ప్రముఖ దర్శకుడు కే బాలచందర్ ఎంపిక చేసి పిలిపించడంతో జీవా కెరీర్ మొదలైందని చెప్పాడు. ఇక జీవా లవ్ స్టోరీలో పెద్దగా యుద్ధాలేమీ లేవని తన తల్లితో తండ్రికి ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడిందని, ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉండటంతో ఆ పరిచయం ప్రేమగా మారిందని చెప్పారు.
ఇక జీవా కమెడియన్ గా మారడం గురించి చెబుతూ ఒకరోజు షూటింగ్‌కు వెళ్లిన జీవా తిరిగి వచ్చేసరికి పూర్తిగావెరైటీ గెటప్‌లో కనిపించాడని చిన్న మీసాలతో కనిపించడంతో అసలు ఇదేం పాత్ర అని ఆశ్చర్యపోయానని చెప్పారు. తన తండ్రితో కామెడీ చేయిస్తారని అస్సలు ఊహించలేదని ఆరోజుల్ని గుర్తుచేసుకున్నాడు.
ఇక జీవాతో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుచేసుకుంటూ జీవా ఒకప్పుడు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉండేవారని తెలిపాడు. అవుట్డోర్ షూటింగ్స్ కోసం వారం, పది రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చేదని ,చిన్నప్పుడు తండ్రి ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసేవాళ్లమని తెలిపాడు.
ముఖ్యంగా ఆయన ఇంటికి వచ్చినప్పుడు తీసుకొచ్చే లెదర్ బ్యాగ్ కనిపించగానే నాన్న వచ్చేశారని గుర్తుపట్టి పరుగెత్తుకుంటూ వెళ్లేవాళ్లమని ఎమోషనల్ అయ్యాడు.షూటింగ్ లేని సమయంలో మాత్రం పిల్లలతో సరదాగా గడిపేవారని, ఇద్దరు అన్నదమ్ముల మీద పడి ఆడుకునేవారని గుర్తు చేసుకున్నారు.
ఇక శ్రీహరితో జీవాకు ఉన్న స్నేహం గురించి చెబుతూ చెన్నైలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఇద్దరూ ఒకే గదిలో ఉండేవారని తెలిపాడు. ఆ తర్వాత శ్రీహరి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు జీవాకు శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్ సెట్ చేసి గుంటూరు హైదరాబాద్ అంటూ తిరగకుండా ఇక్కడే ఉండమని చెప్పారని గుర్తుచేసుకున్నాడు.
అంతటి స్నేహం ఇద్దరి మధ్య ఉండేదని వివరించాడు అయితే శ్రీహరి చనిపోయినపుడు తన తండ్రి చాలా బాధపడ్డారని, ఆయన చివరి సారిగా చూడలేకపోయారని వాపోయాడు .ఇప్పటికీ శ్రీహరి నవ్వుతున్న ముఖమే తన తండ్రి మనసులో ఉందని చెప్పుకొచ్చాడు.మొత్తంగా శ్రీహరి ,జీవా ల మధ్య ఉన్న స్నేహం గురించి జీవా కొడుకు బాలచందర్ చెప్పిన మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .
ALSO READ:బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘దాదా’ రిలీజ్ డేట్‌పై ఫుల్ క్లారిటీ!