BigTV English

Shruti Haasan: కూలీలో నాగార్జున పాత్రపై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్.. అలా అనేసిందేంటీ?

Shruti Haasan: కూలీలో నాగార్జున పాత్రపై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్.. అలా అనేసిందేంటీ?


Shruti Haasan About Nagarjuna Role in Coolie: హిట్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కతోన్న చిత్రం ‘కూలి’. టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగష్టు 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, హీరోయిన్ శ్రుతి హాసన్ లు వరుస ఇంటర్య్వూలతో బిజీగా ఉన్నారు. తాజాగా శ్రుతి హాసన్ మీడిమాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా.. మూవీ విశేషాలతో పాటు నటీనటుల పాత్రలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

నాగ్ సర్ రోల్ అద్భుతం..


ఈ సందర్భంగా కూలీలో నాగార్జున రోల్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.  గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాగ్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కన్ఫాం చేశారు. తాజాగా నాగార్జున పాత్రపై శ్రుతి మాట్లాడుతూ హైప్ ఇచ్చింది. ఇందులో నాగ్ పాత్ర పేరు సిమోన్. ఈ పాత్రలో ఆయన చాలా అద్భుతంగా నటించారని, ఇది ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేస్తుందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాగార్జున సార్ తో నాకు ముందు నుంచి పరిచయం ఉంది. ఆయన ఎప్పుడు ఛార్మింగ్ గా ఉంటారు. ఈ సినిమాలో ఆయనతో వర్క్ చేయడం సూపర్ స్పెషల్. ఎందుకంటే నాగ్ సర్ కి ఇది ఫస్ట్ నెగిటివ్ రోల్.

నెగిటివ్ షేడ్ లో.. 

ఈ పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. కనీసం మీరు ఊహించలేరు. కూలీలో సిమోన్ గా ఆయన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తారు. ఇందులో ఆయనను చూసి నేను సూపర్ ఫ్యాన్ ని అయిపోయా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శ్రుతి కామెంట్స్ నాగ్ రోల్ పై మరింత హైప్ పెరిగింది. కూలీలో నాగార్జున నెగిటివ్ లో ఎలా అదరగొట్టారో.. ఆయన పాత్రను చూసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నామంటున్నారు. కాగా నాగార్జున తన కెరీర్ ఎన్నో భిన్నమైన పాత్రలు పోషించారు. హీరోగా, భక్తుడిగా, మన్మధుడిగా ఇలా రకరకాల పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. గతంలో అంతం అనే మూవీలో నెగిటివ్ షేడ్స్ లో నటించిన నాగ్.. ఇటీవల కుబేరాలో గ్రే షేడ్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.

ఆగష్టు 14న రిలీజ్

ఇప్పుడు కూలీలో పవర్ఫుల్ విలన్ రోల్లో కనిపించబోతున్నాడు. మరి వెండితెరపై ఆయన పాత్ర ఎలా మెస్మరైజ్ చేస్తుందో చూడాలి. కాగా లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ దూకుడు మీద ఉన్నాడు. పెద్దగా హిట్స్ లేక ఢీలా పడ్డ కోలీవుడ్ కి విక్రమ్, లియో వంటి వైవిధ్యమైన కథలతో బ్లాక్ బస్టర్స్ అందించాడు. దీంతో లోకేష్ కనగరాజ్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. దర్భార్, పేట, లాల్ సలాం వంటి చిత్రాలతో ఫ్లాప్స్ చూసిన రజనీకి కూలీ భారీ హిట్స్ ఇస్తుందని ఫ్యాన్స్ అంత నమ్ముతున్నారు. మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ కూడా అంచనాలు మించి ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొడుతుందనడంలో సందేహం లేదంటున్నారు ఫ్యాన్స్. మరి ఆగష్టు 14న కూలీ బాక్సాఫీసు వద్ద ఎలాంటి మోత మోగుతుందో చూడాలి.

Also Read: Anupam Kher: వేల కోట్ల ఆస్తులు.. సొంతంగా ఇల్లు కూడా లేదు.. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణమేంటంటే

Related News

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ తిరిగిన వాహనంపై కఠిన చర్యలు.. అసలేమైందంటే?

OG Movie: ‘ఓజీ’ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. డీవీవీ ట్వీట్‌తో డిసప్పాయింట్‌ అవుతున్న అభిమానులు

Shruti Haasan: బ్లాక్ కలర్ సెంటిమెంట్ వెనక ఇంత కథ ఉందా?

Coolie War 2 films: అక్కడ రెడ్ అలెర్ట్… కూలీ, వార్ 2 సినిమాలకు భారీ నష్టం!

Film industry: ఇండస్ట్రీలో మరో విషాదం.. క్యాన్సర్ తో ప్రముఖ నటి మృతి!

Sridevi: శ్రీదేవి మరణించినా చెల్లి రాకపోవడానికి కారణం.. 2 దశాబ్దాల మౌనం వెనుక ఏం జరిగింది?

Big Stories

×