Anupam Kher Reveals why He Is Still Lives in Rented House: బాలీవుడ్ అగ్ర నటుడు అనుపమ్ ఖేర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీలో ఎన్నో హిట్ చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా తండ్రి పాత్రలతో ఆయన మంచి గుర్తింపు పొందారు. ది కశ్మీర్ ఫైల్స్ లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఇక టాలీవుడ్ హిట్ మూవీ ‘కార్తికేయ 2’ సినిమాతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో ప్రొఫెసర్ రోల్లో కనిపించిన ఆయన శ్రీకృష్ణుడు గురించి వివరించిన తీరు, ఈ సీన్ లో ఆయన పండించిన ఎమోషన్స్ తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. తొలి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
బాలీవుడ్ లో స్టార్.. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే
హిందీతో దశబ్దాలుగా నటిస్తోన్న ఆయన అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. బాలీవుడ్ దిగ్గజ నటుడైన అనుపమ్ ఖేర్.. వేల కోట్ల ఆస్తులకు అధిపతి. అనుకుంటే ముంబైలో ఎన్నో ఇల్లు, ప్లాట్స్ కొనగలడు. కానీ, ఇప్పటి వరకు ఆయన సొంత ఇల్లు కూడా లేకపోవడం షాకిస్తోంది. ఇప్పటికీ ఆయన అద్దె ఇంట్లోనే నివసిస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అనుపమ్ ఖేర్ తన్వి ది గ్రేట్ అనే చిత్రంతో దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తారు. షూటింగ్, నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం థియేటర్లు దొరకగా విడుదల తేదీకి ఆలస్యం అవుతోంది.
అందుకే ఆస్తులు కూడబెట్టడం లేదు
ఈ నేపథ్యంలో అనుపమ్ ఖేర్ తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇఫ్పటికీ ఆయనకు ఆస్తులు, సొంత ఇల్లు కూడా లేకపోవడంపై పెదవి విప్పారు. తన మరణం తర్వాత కుటుంబంలో విభేదాలు రాకుడదనే తాను ఇల్లు కొనలేదని చెప్పాడు. ఆస్తుల గురించి ఆయన మాట్లాడుతూ.. ‘గౌతమ బుద్ధుడు కూడా తన ఆస్తులు, సౌకర్యాలన్నింటినీ వదులి పెట్టి అడవికి వెళ్లాడు. తన జీవితాన్ని నిరాడంబరంగా గడపాలని అనుకున్నాడు. జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని అవసరాలు మాత్రమే ఉంటాయి. కానీ, మనిషి అత్యాశతో అవసరాలకు మించినవి ఆశిస్తుంటాడు. ఒక మనిషి జీవించడానికి ఒక ఇల్లు, కారు, ఇద్దరు వ్యక్తులు, ఇంట్లో పని చేయడానికి ఇద్దరు పనివాళ్లు ఉంటే చాలాు. ఇక్కడ ఇల్లు కావాలంటే మన సొంతమైందా? అద్దె ఇల్లు అనేది ముఖ్యం కాదు. నేను ధనవంతుడిని కాబట్టి సొంత ఇల్లు ఉండాలి, గొల్డెన్ స్పూన్ తోనే అన్నం తినాలి, వెండి పెనంపై కాల్చిన రొట్టలే తినాలని లేదు. నాకేప్పుడు కూడా అలా అనిపించలేదు’ అని చెప్పుకొచ్చారు.
అనంతరం తాన సొంత ఇల్లు కొనకపోవడంపై ఆయన స్పందించారు. ‘నేను వెళ్లిపోయిన తర్వాత తన కుటుంబం ఎటువంటి విభేదాలు లేకుండ ప్రశాంతం జీవితం గడపాలని కోరుకుంటున్నాను. అందుకే నాదంటూ ఎలాంటి ఆస్తిని కూడబెట్టాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ఎలాంటి ఆస్తి లేకుండ ఉంటేనే తక్కువ గొడవలు అవుతున్నాయి. నేను ఎంతోమంది వృద్ధులను చూశాను. వారితో మాట్లాడాను. వారి కథలు నన్నేంతో బాధించాయి. కొడుకు గెంటేసిన తండ్రి ఒకరు, ఆస్తి కోసం సంతం చేయమని బలవంత చేసే కొడుకులు ఉన్నారు. అందుకే ఇలాంటి గొడవలు, సంఘటనలు నా ఇంట్లో జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని వివరణ ఇచ్చారు.