BigTV English

Devara 2 : నార్త్ మార్కెట్ పై దృష్టి పెట్టిన కొరటాల, దేవర 2 సినిమాలో భారీ మార్పులు

Devara 2 : నార్త్ మార్కెట్ పై దృష్టి పెట్టిన కొరటాల, దేవర 2 సినిమాలో భారీ మార్పులు
Advertisement

Devara 2 : రచయితగా కెరియర్ మొదలు పెట్టిన కొరటాల శివ మిర్చి సినిమాతో దర్శకుడుగా మారాడు. బాహుబలి సినిమా ముందు విడుదలైన మిర్చి సినిమా మీద ఎవరికీ పెద్దగా అంచనాలు ఉండేవి కావు. కానీ సినిమా చూసిన తర్వాత ఇంత అద్భుతంగా సినిమాను ఎలా తీశాడో అనిపించుకున్నాడు కొరటాల శివ. మిర్చి సినిమా తర్వాత చేసిన శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.


శ్రీమంతుడు సినిమా తర్వాత కొరటాల శివ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. ఆ తర్వాత కూడా జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సినిమాలు శివ కెరీర్ ని చాలా ముందుకు తీసుకెళ్లాయి. ఆ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమా చేశారు కొరటాల. ఆ సినిమా ఫలితం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్కడితో కొరటాల శివ మీద విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చాడు.

నార్త్ మార్కెట్ పై దృష్టి 

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర. ఈ సినిమా మొదటి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. విపరీతమైన కలెక్షన్లు కూడా ఈ సినిమాకు వచ్చాయి. కొరటాల శివ ఈజ్ బ్యాక్ అని అందరూ అనుకున్నారు. ఇక ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర 2 సినిమా చేయాల్సి ఉంది.


ఇండియా వైడ్ గా ఎన్టీఆర్ కి గుర్తింపు వచ్చేసింది కాబట్టి హృతిక్ రోషన్ తో పాటు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ సినిమాలో నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ ఎన్టీఆర్ క్రేజ్ నార్త్ లో మరింత పెరిగింది.

నార్త్ లో ఎన్టీఆర్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని దేవర 2 సినిమాలో మరో బాలీవుడ్ నటుడును కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దేవర 2 లో సైఫ్ అలీఖాన్ ఉన్నారు. ఇప్పుడు తనతోపాటు మరో నటుడు ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

డ్రాగన్ బిజీ 

మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ప్రశాంత్ నీల్ సక్సెస్ ట్రాక్ అని చెప్పాలి. ఇప్పటివరకు ప్రశాంత్ తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది.

వరుసగా ప్రభాస్ సినిమాలు ఫెయిల్ అవుతున్న తరుణంలో సలార్ సినిమా వచ్చి, భారీ హైప్ ను నిలబెట్టుకుంది. దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది సలార్ సినిమా. ఇప్పుడు ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి.

Also Read: Bandla Ganesh: నా జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్, హరీష్ శంకర్ రియాక్షన్ గమనించారా?

Related News

Prabhas: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానున్న అప్డేట్స్ , సుకుమార్ కల నెరవేరినట్లే

Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?

Suriya 46 : అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన మాస్ మహారాజా కొడుకు, యాక్టింగ్ కు దూరమైనట్లేనా? 

Bandla Ganesh: చిరంజీవి కోసమే సింహాసనం.. మనస్సు ఉప్పొంగిపోయిందన్న బండ్లన్న!

Raviteja: రవితేజకు మాస్ మహారాజ్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?ఆ డైరెక్టర్ వల్లేనా?

Siddu Jonnalagadda: పాప్ కార్న్ అమ్ముకోవడానికి తెలుగులో ఈ పంచాయతీ, సిద్దు సంచలన వ్యాఖ్యలు

Parineeti Chopra: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన పరిణితి చోప్రా..పోస్ట్ వైరల్!

Big Stories

×