Diwali Wishes 2025: అత్యంత ఆనందోత్సాహాలతో.. జరుపుకునే వెలుగుల పండగ దీపావళి. ఈ శుభ సందర్భం.. చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని, చెడుపై మంచి సాధించిన జయాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం మన జీవితంలోకి కొత్త ఆశలను, శ్రేయస్సును, సంతోషాన్ని తీసుకువచ్చే పండగ ఇది.
దీపావళి కేవలం దీపాలు వెలిగించడం.. టపాసులు కాల్చడం మాత్రమే కాదు. మన అంతరంగంలోని అజ్ఞాన చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపుకోవాలని ఈ పండగ మనకు బోధిస్తుంది. శ్రీరాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా.. నరకాసురుడిపై సత్యభామ విజయం సాధించిన సందర్భంగా ఈ పండుగను జరుపుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. 2025 సంవత్సరంలో కూడా.. ఈ దీపాల పండగ మీ ఇంట సుఖసంతోషాల కాంతులను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ శుభ సందర్భంలో మీ కుటుంబ సభ్యులు ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా..
దీపావళి శుభాకాంక్షలు :
“వెలుగుల పండగ దీపావళి మీ ఇంట అష్టైశ్వర్యాలను, సుఖ సంతోషాలను తీసుకురావాలని మనసారా కోరుకుంటూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!”
“ప్రతి దీపం మీ జీవితంలో ఒక కొత్త ఆశను, కొత్త విజయాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ… హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు”
“కారుచీకట్లను తరిమేసే దీప కాంతుల మాదిరిగానే.. మీ కష్టాలు, బాధలు తొలగిపోయి… జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటూ… హ్యాపీ దీపావళి!”
“లక్ష్మీదేవి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండి, సిరిసంపదలు మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ… మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.”
“ఈ దీపావళి పండగ ప్రేమను వ్యాప్తి చేయాలి, ద్వేషాన్ని తొలగించాలి. నవ్వులు, సంతోషాలు మీ ఇంటిని ప్రకాశింపజేయాలి. హ్యాపీ దీపావళి!”
“మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దీపాల పండగైన దీపావళి శుభాకాంక్షలు.. ఈ వెలుగుల పండుగ మీ జీవితంలో సుఖసంతోషాలను, సిరిసంపదలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”
“చీకటిని పారద్రోలి, వెలుగును అందించే ఈ పవిత్రమైన దీపావళి పండగ.. మీ జీవితంలో కొత్త ఆశలను, విజయాలను తీసుకురావాలని ఆశిస్తూ… దీపావళి శుభాకాంక్షలు!”
“ప్రతి దీపం మీ ఇంట నవ కాంతిని, ప్రతి టపాసు మీ మనసులో అనందాన్ని నింపాలని కోరుకుంటూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.”
“ఈ దీపావళి నాడు లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ ఇల్లు ధన, ధాన్య, ఆరోగ్యాలతో నిండిపోవాలని ఆకాంక్షిస్తూ… శుభ దీపావళి!”
Also Read: దీపావళి రోజు ఈ వాస్తు టిప్స్ పాటిస్తే.. డబ్బే డబ్బు
“దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం! ఈ దీప కాంతి మీ అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞానపు వెలుగును ప్రసాదించాలని కోరుకుంటూ… దీపావళి శుభాకాంక్షలు.”
“శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీస్సులతో.. మీ వ్యాపారంలో అష్ట ఐశ్వర్యాలు లభించి, మీ కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపించాలని కోరుకుంటూ… హ్యాపీ దీపావళి !”
“నరకాసుర సంహార ఘట్టాన్ని, శ్రీరాముడి విజయాన్ని గుర్తుచేసే ఈ పండగ… మీ జీవితంలోని కష్టాలన్నింటినీ తొలగించి, సంతోషాలను వెల్లివిరియజేయాలని కోరుకుంటూ… హ్యాపీ దీపావళి!”