BigTV English

Sir Madam Teaser: భార్యాభర్తలుగా విజయ్ సేతుపతి, నిత్యా మీనన్.. టీజర్ బాగుంది.. అదొక్కటే తేడా..

Sir Madam Teaser: భార్యాభర్తలుగా విజయ్ సేతుపతి, నిత్యా మీనన్.. టీజర్ బాగుంది.. అదొక్కటే తేడా..

Sir Madam Teaser: తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సార్ మేడమ్’.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ లు భార్యా భర్తలుగా నటిస్తున్నారు. తమిళ్లో ‘తలైవాన్ తలైవి ‘ పేరుతో తెరకెక్కుతుంది. తమిళ స్టార్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపోందుతుంది. విజయ్ సేతుపతి నుంచి రాబోతున్న సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. భార్యాభార్తలుగా నిత్యా మీనన్, విజయ్ సేతుపతి నటన అదిరిపోయిందని ఆ వీడియోను చూస్తే తెలుస్తుంది..


‘సార్ మేడమ్’ టీజర్..

నువ్వు వంటే చెయ్యనక్కర్లేదు కోడలా నే డైలాగుతో మొదలైన టీజర్ ఆ తర్వాత నువ్వు మీ ఇంట్లో కూడా లేని విధంగా వాళ్లు కూడా నా కూతురును చూసుకోలేము అన్నంతగా మహారాణి లాగా చూసుకుంటాను అని విజయ్ సేతుపతి డైలాగ్ బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత నిత్యా మీనన్, విజయ్ సేతుపతి పరాట చేస్తూ ఇదేనా నువ్వు నన్ను మహారాణిలా చూసుకోవడం అంటే ని గొడవ పడుతుంది. మేడమ్ నీకు ఇక్కడ నచ్చక పోతే మీ అంతఃపురానికి వెళ్లొచ్చుగా అని అంటాడు. సార్ మా ఇల్లు నాకు అంతఃపురమే అని అంటుంది. ఇద్దరు సార్, మేడమ్ అంటూ గొడవ పడతారు. టీజర్ లో వీరిద్దరి గొడవ చూస్తుంటే ఇది భార్యాభర్తల మధ్య సాగే స్టోరీలాగా కనిపిస్తుంది. టీజర్ లోని సన్నివేశాలను చూస్తుంటే విజయ్ సేతుపతి ఒక హోటల్ ను నడుపుతున్నట్లు తెలుస్తుంది. వంట మాస్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ఆయనతో పాటుగా భర్తకు తోడుగా ఉండే భార్య పాత్రలో నిత్యా నటిస్తుందని ఆ వీడియోను చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.


 అదొక్కటే మైనస్..

విజయ్ సేతుపతి నటించిన సినిమాల్లో గంభీరమైన వాయిస్ ఉంటుంది. సార్ మేడమ్ మూవీ నుంచి తాజాగా రిలీజ్ అయిన టీజర్ బాగుంది. కానీ, విజయ్ సేతుపతి, నిత్య మీనన్ డబ్బింగ్ బాలేదు.. వాళ్ల వాయిస్‌లు అందరూ విన్నారు. ఇప్పుడు వేరే వాయిస్‌తో చూస్తే వాళ్లను చూస్తున్నట్టు ఫీల్ రాలేదు. టీజర్ కాబట్టి పర్లేదు. సినిమాలో అయినా.. వారే డబ్బింగ్ చెబితే బాగుంటుంది.. ఎప్పుడు చూస్తున్న వాళ్లను కాకుండా కొత్త వాళ్లను చూస్తున్న ఫీల్ వస్తుందని కొందరు నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై చిత్ర యూనిట్ స్పందిస్తుందేమో చూడాలి.. టైటిల్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక విజయ్ సేతుపతి విలన్ గా సినిమాలు చేస్తున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తున్నాడు. చివరగా ఏస్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ నిరాశ పరిచింది. ఈ మూవీ పై ఆశలు పెట్టుకున్నాడు. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Manchu Lakshmi: కుటుంబంలో గొడవలు.. నేను సైలెంట్ గా ఉండడానికి కారణం అదే

Andhra King Taluka: ఆంధ్రా కింగ్ కు బర్త్ డే .. ఉపేంద్ర పోస్టర్ రిలీజ్

Allu vs Mega :పాన్ ఇండియా మెగాస్టార్ గా బన్నీ.. కథ సుఖాంతం అనుకుంటే.. మళ్లీ మొదలెట్టారే..

Fauji Movie : ‘ఫౌజీ’ లో బాలీవుడ్ బడా హీరో.. డైరెక్టర్ ప్లానింగే వేరప్పా..

Nag 100: నాగార్జున 100వ సినిమా ముహూర్తం ఆరోజే.. గెస్ట్ గా ఆ స్టార్ హీరోస్.. టైటిల్ కూడా

RGV: వర్మపై మరో కేసు ఫైల్.. తప్పుదోవ పట్టించారంటూ?

Cm Revanth Reddy: చలనచిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లాలి

Anaganaga Oka Raju : వంశీ మామూలు ప్లానింగ్ కాదు, ఏకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్

Big Stories

×