Gummadi Narasaish: ఇటీవల కాలంలో ఎంతోమంది రాజకీయ నాయకులకు సంబంధించిన బయోపిక్ సినిమాలతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో రాజకీయ నాయకుడి బయోపిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. రాజకీయాలలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో గుమ్మడి నరసయ్య(Gummadi Narasaiah) ఒకరు. త్వరలోనే ఈయన బయోపిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ బయోపిక్ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Sivaraj Kumar)గుమ్మడి నరసయ్య పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవల వెల్లడించారు.
ఇలా గుమ్మడి నరసయ్యగా శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ పాత్రకు శివన్న సరిగ్గా సరిపోయారంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా శివరాజ్ కుమార్ కు భారీ ఎలివేషన్స్ ఇస్తూ ఆయనని పరిచయం చేయడమే కాకుండా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది అంటూ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ వెల్లడించారు. ఇందులో భాగంగా శివన్న ఎర్ర కండువా వేసుకొని సైకిల్ పై అసెంబ్లీకి వెళ్లడం అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇలా గుమ్మడి నరసయ్య బయోపిక్ సినిమాని ప్రకటించడంతో చాలామందికి గుమ్మడి నరసయ్య ఎవరు అనే ఆ సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి. సాధారణంగా ఒక బయోపిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే వారికి ఎంతో పేరు ప్రఖ్యాతలు, ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇక గుమ్మడి నరసయ్య కూడా కమ్యూనిస్టు పార్టీ లీడర్ గా ఉంటూ రైతుల పక్షాన తన గళం వినిపించారు. ఇలా గ్రామ సర్పంచ్ గా మొదలైన తన రాజకీయ ప్రస్థానం రాజకీయాలలో తనని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఇలా గ్రామ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఈయన రాజకీయాలలో ఎదిగారు.
Gummadi Narsaiah Motion Poster.
@s@nimmashivarajkumar
Directed by @parameshhivrale
Produced by @Pravallika_Arts @narsaiahgummadi #shivarajkumar #gummadinarsaiahbiopic #gummadinarsaiahmovie pic.twitter.com/qrVqeBs0jh— Pravallika Arts Creations (@Pravallika_Arts) October 22, 2025
రెండుసార్లు తెలంగాణ ఎన్నికలలో పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించి అసెంబ్లీలో కూడా రైతుల పక్షాన నిలబడిన ఘనత గుమ్మడి నరసయ్యదని చెప్పాలి. ఇలా ఎమ్మెల్యేగా ఉన్నత హోదాలో ఉన్న ఒక సాధారణ వ్యక్తిగా తన జీవితాన్ని ప్రజలకి అంకితం చేశారు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు అంటే పెద్ద ఎత్తున కార్లు బంగ్లాలు చుట్టూ మనుషులు ఉంటారు కానీ గుమ్మడి నరసయ్య జీవితం ఇందుకు పూర్తిగా భిన్నమని చెప్పాలి. ఇలా గుమ్మడి నరసయ్య జీవితంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కనుక ఈయన బయోపిక్ సినిమాని చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ పాత్రలో శివన్న అద్భుతంగా సెట్ అయ్యారని చెప్పాలి .అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.