రూ.13,000 కోట్ల విలువైన బ్యాంకుల మోసం కేసుల్లో విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని త్వరలో భారత్ కు తీసుకురానున్నారు. ప్రస్తుతం బెల్జియంలో ఉన్న అతడిని భారత్ కు అప్పగించేందుకు అక్కడి అధికారులు సిద్ధం అయ్యారు. ఇండియాకు తీసుకొచ్చిన తర్వాత ఈ మెగా చోర్ ను ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంచనున్నారు. అయితే, జైల్లో అతడికి ప్రత్యేక వసతులు కల్పించాలనే బెల్జియం కోర్టు ఆదేశాల మేరకు ఈ జైల్లో తన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జైలు అధికారులు. తాజాగా అతడు జైల్లో ఉండబోయే బ్యారెక్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలు చూసి అంతా షాక్ అవుతున్నాయి. సాంప్రదాయక భయంకరమైన జైలు గదుల మాదిరిగా కాకుండా, ఛోక్సీని ఉంచే బ్యారక్ బోటిక్ హోటల్ సూట్ మాదిరిగా కనిపిస్తుంది. ఇండియన్ ప్రాసిక్యూటర్లకు బెల్జియం కోర్టుకు సమర్పించిన ఈ ఫోటోలు, యూరోపియన్ జైలు ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యం, భద్రతను కలిగి ఉంది. బ్యారక్ 12లోని రెండు ప్రత్యేక సెల్ లను అతడి కోసం రెడీ చేశారు.
⦿ గాలి, వెలుతురు: ఛోక్సీని ఉంచే సెల్ లో మూడు కిటికీలు, ఐదు వెంటిలేటర్ల ద్వారా లోపలికి చక్కగా లైటింగ్ వచ్చేలా చేశారు. క్రాస్ వెంటిలేషన్, మూడు సీలింగ్ ఫ్యాన్లు తగినంత గాలిని అందించనున్నాయి.
⦿ సౌకర్యాలు: సెల్ లో వార్తలు, సినిమాలు చూసేందుకు ఓ ఎల్ఈడీ టీవీ ఏర్పాటు చేశారు. అటాచ్ డ్ వాష్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇందులో వెస్ట్రన్ టాయిలెట్, వాష్ బేషిన్ ఏర్పాటు చేశారు. నేచురల్ రైట్ రానప్పుడు తగినంత వెలుతురును అందించడానికి ఆరు ట్యూబ్ లైట్లను ఏర్పాటు చేశారు.
⦿ భద్రత: ఛోక్సీ ఉండే బ్యారెక్ దగ్గర 24 గంటల భద్రత ఉంటుంది. బ్యారక్ లో వెలుతురు, గాలి లోపలికి అనుమతించడానికి స్టీల్ తో తయారు చేసిన గేట్ ఏర్పాటు చేశారు. బ్యారక్ బయట విశాలమైన కారిడార్, పొడవైన వాకింగ్ ప్లేస్ ఉంది.
Read Also: అక్టోబర్ 29 లోపే సెలవులు తీసుకుని ఎంజాయ్ చేసేయ్యండి.. ఖగోళ శాస్త్రవేత్త హెచ్చరిక!
పెద్ద పెద్ద నేరాలకు పాల్పడిన వైట్ కాలర్ క్రిమినల్స్ ను ఉంచేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక జైలు గదిని సిద్ధం చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ బ్యారెక్ ను రెడీ చేశారు. భారత్ అభ్యర్థన మేరకు బెల్జియం కోర్టు ఇటీవల చోక్సీ అరెస్టును సమర్థించింది. అతడిని అప్పగించేందుకు కూడా దాదాపు అంగీకరించింది. అందులో భాగంగానే ఆయనను ఉంచే జైలు బ్యారెక్ వివరాలను అడిగింది. ఈ నేపథ్యంలో స్పెషల్ బ్యారెక్ ఫోటోలను ఇండియన్ ప్రాసిక్యూటర్స్ కోర్టుకు సమర్పించారు.
Read Also: వద్దని చెప్పినా వినకుండా.. 9 నెలల పాపతో మంచు పర్వతమెక్కిన జంట, చివరికి..