E-Paper
Advertisement

దుబాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్‌కి శోభితా ధూళిపాళ్ల రిప్లై వైరల్.. నెటిజన్లు ఫిదా..

దుబాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్‌కి శోభితా ధూళిపాళ్ల రిప్లై వైరల్.. నెటిజన్లు ఫిదా..
Advertisement

Sobhita Dhulipala: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే నటి శోభితా ధూళిపాళ్ల మరియు దుబాయ్ బేస్డ్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రీలత అడెపల్లి మధ్య జరిగిన సంభాషణ. తెలుగు మూలాలున్న మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఎలా రాణిస్తున్నారో వివరిస్తూ శ్రీలత చేసిన ఒక పోస్ట్, దానికి శోభితా ఇచ్చిన లోతైన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Read also-విజయ్ రాజకీయ భవిష్యత్తుపై వేణుస్వామి జోస్యం..

తెలుగు మహిళల విజయగాథ

Advertisement

శ్రీలత అడెపల్లి తన వీడియోలో ప్రపంచ వేదికలపై తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న తెలుగు మహిళలను కొనియాడారు. కేవలం సినిమా రంగమే కాకుండా వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న వారిని ఆమె ప్రస్తావించారు. ఆ జాబితాలో నటి శోభితా ధూళిపాళ్ల, చానెల్ మోడల్ భవిత మండవ, ప్రముఖ ర్యాపర్ రాజా కుమారి, బ్యూటీ ఆంట్రప్రెన్యూర్ దీపికా ముత్యాల ఉన్నారు. తమ మూలాలను మర్చిపోకుండా, ఆత్మవిశ్వాసంతో గ్లోబల్ స్టేజ్‌పై రాణిస్తున్న వీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని శ్రీలత పేర్కొన్నారు.

ఒక జీవిత సత్యం!

సాధారణంగా సెలబ్రిటీలు ఇటువంటి పోస్ట్‌లకు ‘థాంక్యూ’ లేదా ఒక ‘హార్ట్ ఎమోజీ’తో సరిపెడుతుంటారు. కానీ శోభితా ధూళిపాళ్ల మాత్రం ఎంతో లోతైన సందేశాన్ని రిప్లైగా ఇచ్చారు. ఆమె తన మనసులోని మాటలను ఇలా పంచుకున్నారు “ఏది ఏమైనా సరే, మీ అంతరాత్మను నమ్మండి. నా జీవితంలో అత్యంత అర్థవంతమైన క్షణాలు.. తర్కానికి అందకపోయినా, ఎలాంటి ఉపయోగం ఉండదని అనిపించినా నా మనసు చెప్పిన మాట విన్నప్పుడే కలిగాయి. అలా కాకుండా చేసిన ప్రతిసారీ నాకే ఎదురుదెబ్బలు తగిలాయి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఈ జీవితం నదిపై సాగే ఒక చిన్న ప్రయాణం లాంటిది.. ఆ ప్రవాహాన్ని, గాలిని ఆస్వాదించండి.”

Advertisement

Read also-రౌడీ జనార్ధన స్పెషల్ పోస్టర్.. “ప్రపంచంతో పోరాడే యోధుడు ప్రేమకు లొంగిపోతాడు”!

వెల్లువెత్తుతున్న ప్రశంసలు

శోభితా ఇచ్చిన ఈ సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆమెలోని పరిణతిని, నిజాయితీని వేల సంఖ్యలో నెటిజన్లు అభినందిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మహిళలు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ, ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ సంభాషణలా కాకుండా, ఈ వైరల్ మూమెంట్ మహిళా సాధికారతకు తమ మూలాలను గౌరవించుకోవడానికి ఒక నిదర్శనంగా నిలుస్తోంది.

?igsh=a2k3NDFlbXJxczFy

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×