Venu Swamy:గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఏకైక పేరు విజయ్ దళపతి. అటు కొంతకాలంగా ప్రముఖ హీరోయిన్ త్రిషతో రిలేషన్ అంటూ ఎఫైర్ రూమర్స్ కారణంగా వార్తల్లో నిలుస్తూనే.. మరొకవైపు తన భార్య సంగీత విడాకులు ఇవ్వడం మరో సంచలనంగా మారింది. దీనికి తోడు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు.
అందులో భాగంగానే ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 234 సీట్లలో పోటీ చేస్తే.. 108 సీట్లు కైవసం చేసుకొని.. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా తన పార్టీ (TVK) తో అవతరించారు. అయితే ఆ పదవిని దక్కించుకోవడానికి ఇంకా 10 సీట్లు లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆయనతో పొత్తు కలపడానికి కొన్ని పార్టీలు ముందుకు వచ్చాయి.. ఇక ఎలాగో ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి విజయ్ రాజకీయ భవిష్యత్తుపై చేసిన కామెంట్లు సంచలనానికి దారితీస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ ఆస్ట్రాలజర్ గా పేరు దక్కించుకున్న వేణుస్వామి.సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల జాతకాలు చెబుతూ.. నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీల జీవితాలపై ఆయన చేసిన కామెంట్స్ నిజమైతే.. మరికొన్ని బెడిసి కొట్టాయి. అయితే ఇప్పుడు అందరిలాగే ఈయన ఫోకస్ కూడా తమిళనాడు రాజకీయాలపై పడింది. తాజాగా దళపతి విజయ్ పై, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఈ మేరకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేస్తూ..” 2026 మే 25 నుంచి జూన్ 2 మధ్య జరిగే గురు మార్పు దేశ రాజకీయాలలో పెద్ద మార్పులకు కారణమవుతోంది. ప్రస్తుతం మిధున రాశిలో ఉన్న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక సెప్టెంబర్ లో సింహరాశిలోకి మారుతాడు. ఈ గురు మార్పు ప్రభావం కొన్ని రాష్ట్రాలపై తీవ్రంగా పడుతుంది.
ముఖ్యంగా తమిళనాడు , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఇప్పటికే ఆ ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. ఇక తమిళనాడు రాజకీయాల విషయానికి వస్తే.. అస్థిరత తప్పదు. విజయ్ జాతకం , తమిళనాడు రాష్ట్ర జాతకాలను కలిపి పరిశీలించినట్లయితే.. ఒకవేళ విజయ్ ముఖ్య మంత్రి అయినా కూడా ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు. తమిళనాడులో మళ్లీ ఎన్నికలు రావడం వెయ్యికి వెయ్యి శాతం ఖాయం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెలలోపు లేదా ఏడాదిలోపు రాజకీయ సంక్షోభం వస్తుంది. అలా మళ్ళీ ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి” అంటూ వేణు స్వామి తెలిపారు.
అలాగే విజయ్ – త్రిష రిలేషన్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ..” ఏకనోడి కాంబినేషన్” గా అభివర్ణించారు . త్రిషా ప్రభావం లేకపోతే విజయ్ ఎన్నికల ఫలితం మరోలా ఉండేది అంటూ విజయ్ – త్రిష మధ్య రిలేషన్ పై రూమర్స్ వస్తున్న వేళ వేణు స్వామి ఇలా స్పందించి కామెంట్లు చేశారు.
also read:విజయ్ జాతకంలో త్రిష మార్క్.. సీఎం అయినా ఆ గండం తప్పదా? వేణుస్వామి షాకింగ్ జోస్యం!
ఇక ఇదే సమయంలో ఆయన పశ్చిమ బెంగాల్ రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ.. అక్కడ బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. భవిష్యత్తులో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మమతా బెనర్జీ జాతకంలో మళ్లీ సీఎం అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు అంటూ తెలిపారు. మొత్తానికైతే వేణు స్వామి రాజకీయాలపై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.