VC Sajjanar: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ నియమితులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీపీగా కొనసాగుతున్న సీవీ ఆనంద్ హోమ్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వం బదిలీ చేసిసంది. టీజీఎస్‌ఆర్టీసీ ఎండీగా 2021 సెప్టెంబరులో బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ నాలుగేండ్లుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టడంలో తన కీలక పాత్రను పోషించారు. అయితే, టీజీఎస్‌ఆర్టీసీ ఎండీగా చివరి రోజున వీసీ సజ్జనార్ సాధారణ ప్రయాణికుడిగా హైదరాబాద్ సిటీ బస్సులో ప్రయాణం చేశారు.
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా తన చివరి రోజున సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ నగర వాసులతో బస్సులో ప్రయాణించారు. లాస్ట్ డే సాధారణ ప్రయాణికుడిగా సిటీ బస్సులో ప్రయాణించడంతో సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లక్డీ కపూల్-టెలిఫోన్ భవన్ బస్ స్టాప్ వద్ద 113 I/M రూట్ బస్సును ఎక్కిన ఆయన టీజీఎస్‌ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్ భవన్ వరకు ప్రయాణించారు. ఐపీఎస్ అధికారిగా కాకుండా ఓ సాధారణ ప్రయాణికుడిగా యూపీఐ ద్వారా చెల్లింపు చేసి, కండక్టర్ నుంచి టికెట్ తీసుకున్నారు. ప్రయాణంలో తోటి ప్రయాణికులతో స్నేహ పూర్వకంగా మాట్లాడారు. వారి అనుభవాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ గురించిన అభిప్రాయాలు విన్నారు. ఈ సంభాషణలు ఆయనకు ప్రజల అవసరాలను మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చాయి.
ALSO READ: AIIMS Mangalagiri: మంగళగిరిలో ఉద్యోగాలు.. ఒక్క ఇంటర్వ్యూతోనే జాబ్, రూ.1,50,000 జీతం
వీసీ సజ్జనార్ 2021లో టీజీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. ఆయన నాయకత్వంలో టీజీఎస్‌ఆర్టీసీ ఎన్నో సంస్కరణలు చేపట్టింది. డిజిటల్ టికెటింగ్ వ్యవస్థను ప్రోత్సహించడం, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం వంటివి చాలా ప్రధానమైనవి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యాత్రాదానం వంటి సామాజిక కార్యక్రమాలు ప్రారంభించారు. అనాథలు, పేద విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు అందించే యాత్రాదానం పథకం దేశంలోనే మొదటిది. దాతలు స్పాన్సర్ చేసి, ఆ బస్సులతో పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలకు టూర్లు నిర్వహించవచ్చు.
ALSO READ: Dance Heart Attack: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి
బతుకమ్మ, దసరా పండుగల సమయంలో 7,754 ప్రత్యేక బస్సులు నడిపించి, ప్రయాణికుల సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు తోడ్పడ్డారు. మహిళల భద్రత కోసం ఎంతో కృషి చేశారు. సెన్సిటివిటీ ట్రైనింగ్, టెక్-బేస్డ్ కంప్లైంట్ సిస్టమ్స్ ప్రవేశపెట్టారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు తగిన చర్యలు తీసుకున్నారు. ట్విట్టర్‌లో ప్రయాణికుల ఫిర్యాదులకు తక్షణ స్పందన ఇచ్చి, సేవలను మెరుగుపరిచారు. ఆయన చివరి రోజు బస్ ప్రయాణం, టీజీఎస్‌ఆర్టీసీని స్వయం సమృద్ధిగా మార్చడం, సిబ్బంది సంక్షేమానికి చేసిన కృషిని గుర్తుచేస్తుంది. 48,000 మంది ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చివరి రోజున బస్సులో ప్రయాణించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సజ్జనార్ లాంటి నాయకులు పబ్లిక్ సర్వీస్‌లో ఎలా మార్పు తీసుకురావాలో ఉదాహరణగా నిలుస్తారు. ఆయన మున్ముందు కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.