BigTV English

K Ramp : ప్రమోషన్స్‌కు ఎందుకింత ఖర్చు… హీరోకు ప్రీ ప్రొడక్షన్ బాధ్యత లేదా?

K Ramp : ప్రమోషన్స్‌కు ఎందుకింత ఖర్చు… హీరోకు ప్రీ ప్రొడక్షన్ బాధ్యత లేదా?

K Ramp : ‘క’ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం.. ఓ డిజాస్టర్ మూవీ చేసి, ఇప్పుడు K Ramp అనే మూవీ చేస్తున్నాడు. నిన్న ఆ మూవీకి సంబంధించిన టీజర్ వచ్చింది. ఆ టీజర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే… టీజర్ చివర్లో కిరణ్ అబ్బవరం “హెవీ ఎంటర్టైనర్ లోడింగూ..” అని అంటాడు. కానీ, ఆ టీజర్ చూసిన జనాలు మాత్రం “హెవీ బూతుల సినిమా లోడింగూ” అని అంటున్నారు. ఇక అర్థం చేసుకోవాలి.. ఆ టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందో.


అయితే, ఇలాంటి సినిమాకు హీరో కిరణ్ అబ్బవరం హెవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడాట. దానికి నిర్మాత రాజేష్ దండా నుంచి ప్రత్యేకంగా బడ్జెట్ కూడా పెట్టిస్తున్నాడట. ఆ.. కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కిరణ్ అబ్బవరం ఎన్నో సినిమాలు చేశాడు. కానీ, ఒక్క హిట్ రాలేదు. అలాంటి టైంలో ఒక మంచి సబ్జెక్ట్ తీసుకుని ‘క’ అనే సినిమా చేశాడు. అది సూపర్ హిట్ అయింది. దీంతో కిరణ్ అబ్బవరం 5 ఏళ్ల కెరీర్‌లో ఫస్ట్ హిట్ కొట్టాడు. ఇక అదే జోరు కంటిన్యూ చేస్తా అని అన్నాడు. కానీ, ‘క’ మూవీ తర్వాత దిల్‌రుబా అనే మూవీ చేసి, ఎప్పటిలానే డిజాస్టర్‌ తెచ్చుకున్నాడు.


బూతుల మూవీ..

ఇప్పుడు ‘క’ మరిపించే సినిమా వస్తుంది అంటూ K Rampపై భారీగా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ మూవీ దీవాళి సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కాబోతుంది. తాజాగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా వచ్చేసింది. టీజర్‌లో పచ్చి బూతులు ఉన్నాయి అంటూ ట్రోల్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. కిరణ్ అబ్బవరం కు బిల్డప్స్ ఎక్కువ అయ్యాయి అని క్రిటిక్స్ కూడా మాటలు అనేస్తున్నారు.

ప్రమోషన్స్‌.. నిర్మాతపై మరింత భారం ?

ఇది పక్కన పెడితే, ఈ K Ramp మూవీకి కిరణ్ అబ్బవరం భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారట. సినిమా అంటే ప్రమోషన్స్ ఉండవా… దాన్ని కూడా తప్పుపడుతారా అని అనొచ్చు. అయితే, ఇక్కడ ప్రమోషన్స్ చేయడం తప్పుకాదు. ఆ ప్రమోషన్స్ పేరుతో నిర్మాత తలపై మరింత భారం మోపడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం వస్తుంది.

ప్రమోషన్స్‌కు 2 కోట్లు ?

K Ramp ని ప్రమోట్ చేయడానికి దాదాపు కోటి నుంచి 2 కోట్ల వరకు ఖర్చు చేయాలని నిర్మాతకు హీరో కిరణ్ అబ్బవరం సూచించారట. సాధారణంగా ఈ మూవీ బడ్జెట్ దాదాపుగా 12 నుంచి 15 కోట్లు వరకు ఉందట. ఇప్పుడు అధనంగా మరో 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ప్రమోషన్స్ ఖర్చు. ఇలాంటి బూతులు ఉన్న సినిమాకు అంత బడ్జెట్ పెట్టడమే కాదు… మళ్లీ ప్రమోషన్స్ పేరుతో మరింత ఖర్చు చేయడం సరికాదేమో… నిర్మాతకు అధిక భారం పడుతుందేమో అనే మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

ప్రీ ప్రొడక్షన్ బాధ్యత లేదా ?

ప్రమోషన్స్‌ కోసం ఇంతలా ఖర్చు చేయడం చూసి… హీరో ప్రీ ప్రొడక్షన్ టైంలో ఏం చేశారు ? ఆ టైంలోనే కదా… అంతా చూసుకోవాల్సింది. ఆ బాధ్యత హీరోకు ఉండాలి కదా.. అప్పుడు సైలెంట్‌గా ఉండి… ఇప్పుడు నిర్మాతకు భారం అయ్యే పనులు ఎందుకు అనే కామెంట్స్ వస్తున్నాయి.

మరి ఇంతలా ఖర్చు పెడుతున్నారు.. సరే. K Ramp మూవీ ‘క’ లా హిట్ అయితే పర్లేదు. కానీ, ఏ మాత్రం కొట్టినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

Related News

Payal Rajput: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా పాయల్ పాపా.. అయినా హాట్ గానే ఉన్నావనుకో

OG Ticket Price: ఏపీలో OG టికెట్‌ ధర రూ. లక్ష.. ఫస్ట్‌ టికెట్‌ కొన్నది ఎవరంటే..!

Sambarala Yeti Gattu: సంబరాల ఏటి గట్టు వాయిదా.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

Shiva Re- Release: కల్ట్ క్లాసిక్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసిందిరోయ్.. సైకిల్ చైన్స్ సిద్ధం చేసుకోండిరోయ్

Deepika Padukone: కల్కిలో ప్రభాస్ జోకర్… దీపిక ఆ సీన్ చేసింది కాబట్టే బ్లాక్ బస్టర్

Deepika Padukone Kalki 2: కొత్త హీరోయిన్ రావడం కాదు… ఆ పాత్రనే ఎత్తేశారా ?

Shraddha Kapoor: లేట్ వయసులో రిలేషన్షిప్… కన్ఫర్మ్ చేసిన శ్రద్ధా.. పోస్ట్ వైరల్

Big Stories

×