Shraddha Kapoor:శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor).. బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈ చిన్నది.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్న ఈమె.. తాజాగా తన రిలేషన్ షిప్ ను కన్ఫామ్ చేస్తూ విడుదల చేసిన వీడియో అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. శ్రద్ధ కపూర్ గత కొన్ని రోజులుగా స్క్రిప్టు రైటర్ రాహుల్ మోడీ (Rahul Modi) తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఇటీవల ఆమె మొబైల్ స్క్రీన్ వాల్ పేపర్ గా కూడా వీరిద్దరూ జంటగా ఉన్న ఫోటో కనిపించింది. దీంతో దాదాపుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని అందరూ కన్ఫామ్ చేసుకున్నారు.
అయితే ఇప్పుడు ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అనిపిస్తోంది. అంతేకాదు పలు ఈవెంట్లకి కూడా వీరిద్దరూ జంటగా వెళ్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఒక పోస్ట్ ద్వారా తన రిలేషన్షిప్ పై క్లారిటీ ఇచ్చింది శ్రద్ధా కపూర్. ” మీ కోపాన్ని, చిరాకును భరించే వ్యక్తి మీ లైఫ్ లో ఎవరు? అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. అంతేకాదు రాహుల్ మోడీని కూడా ఆమె టాగ్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ మాత్రం.. తన కాబోయే భర్త కోపాన్ని, చిరాకును కంట్రోల్ చేసే వ్యక్తి అని చెప్పకనే చెప్పేసింది అంటూ పోస్ట్లు పెడుతున్నారు. మొత్తానికి అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన వారంతా రిలేషన్షిప్ కన్ఫామ్ చేసింది అని కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది అప్పుడే కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. ఇంకొంతమంది లేటు వయసులో రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసింది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ALSO READ:Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!
శ్రద్ధా కపూర్ కెరియర్..
శ్రద్ధా కపూర్ విషయానికి వస్తే.. ప్రముఖ నటుడు శక్తి కపూర్ (Shankti kapoor) కుమార్తెగా 1987 మార్చి 3న జన్మించింది. 2010లో ‘టీన్ పట్టి’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. లవ్ కా ది ఎండ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. శ్రద్ధా కపూర్ నటి మాత్రమే కాదు గాయకురాలు కూడా. గత ఏడాది స్త్రీ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఇప్పుడు స్త్రీ 3 సినిమాలో కూడా నటిస్తోంది. ఇకపోతే ఈమెకు మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం మాత్రం ఆషికి 2 అని చెప్పవచ్చు. ఈ సినిమాలో గాయని పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాదు ఈమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి కూడా నామినేషన్ లభించింది. ఆ తర్వాత ఏక్ విలన్, ఏబిసిడి, భాగీ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు 38 ఏళ్ల కెరియర్లో తన రిలేషన్షిప్ ను కన్ఫామ్ చేస్తూ షేర్ చేసిన వీడియోతో మళ్ళీ వార్తల్లో నిలిచింది ఈ చిన్నది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==