గత కొంత కాలంగా గుర్గావ్ లో జరుగుతున్న సంఘటనలు అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. ఆగస్టులో ఓ యువతి రాజీవ్ చౌక్ దగ్గర క్యాబ్ కోసం వేచి చూస్తుండగా, ఓ వ్యక్తి ఆమెను చూస్తూ ప్యాంట్ జిప్ తీసి అనుచితంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. పట్టపగలే ఈ ఘటన జరగడంతో అందరూ షాకయ్యారు. ఇప్పుడు మేదాంత ఆస్పత్రి పరిధిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. సెక్టార్ 38లో రాత్రి 12.20 గంటలకు ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..
అర్థరాత్రి సమయంలో మేదాంత ఆస్పత్రి సమీపంలో రోడ్డు పక్కన ఓ నల్లని థార్ కారు ఆగింది. పక్కనే అపార్ట్ మెంట్ బాల్కనీలో ఓ యువతి నిలబడి ఉంది. ఆమెను అతడు అలాగే చూస్తూ ఉండిపోయాడు. వెంటనే ఆమెను చూస్తూ, వెగటు పుట్టే పని చేశాడు. జిప్ తీసి హస్తప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. ఆ దృశ్యాన్ని చూసి సదరు యువతి షాకయ్యింది. “నేను బాల్కనీలో నిలబడి ఓ స్నేహితుడితో మాట్లాడుతుండగా, రోడ్డు పక్కనే ఒక వ్యక్తి నల్లటి థార్ లో వచ్చి ఆగాడు. అతడు అక్కడ ఆపి కూర్చున్నాడు అనుకున్నాను. కానీ, ఆ తర్వాత ఏదో తేడాగా అనిపించింది. అతడు నన్ను చూస్తూనే హస్తప్రయోగం చేస్తున్నాడని గ్రహించాను. నేను లోపలికి పరుగెత్తాను. నా రూమ్ మేట్ కి చెప్పాను. మేము మా గది కర్టెన్ల నుండి ఫోన్ ఈ వీడియోను రికార్డు చేశాం. రికార్డ్ చేయడం ప్రారంభించాము. అతడు తన సీటులో పడుకుని, సిగ్గు లేకుండా మమ్మల్ని చూస్తూ ఆ పని చేస్తున్నాడు. దాదాపు 10 నిమిషాల పాటు అలాగే చేశాడు. మా ఫ్రెండ్ బయటకు వెళ్లి ఫోన్ లో షూట్ చేయడం మొదలుపెట్టాడు. వెంటనే అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన రాత్రి 12:20 గంటలకు, మేదాంత ఆసుపత్రి సమీపంలో జరిగింది” అని చెప్పుకొచ్చింది.
Creepy instance in Gurgaon
byu/Longjumping_Ad2421 ingurgaon
ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకయ్యారు. వెంటనే సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “మీరు అతడి కారు నెంబర్ ను షూట్ చేశారా? ఒకవేళ అతడి నెంబర్ ను పోస్టు చేయండి” అని ఓ నెంబర్ కామెంట్ చేశాడు. “ఆ కారు నెంబర్ ప్లేట్ చూసే కోణంలో మేం లేము. అతడు పారిపోయేటప్పుడు మేం రికార్డు చేసేందుకు ప్రయత్నించాం. కానీ,. సాధ్యం కాలేదు” అని రాసుకొచ్చారు. “మీరు ఇప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేసి వారికి ఈ వీడియో ఇవ్వాలి” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఇది గుర్గావ్ లో కామన్ అయ్యింది. చాలా మంది ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారు. పోలీసుటు అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
ఆగస్టులోనూ గుర్గావ్ లో ఇలాంటి ఘటన జరిదింది. జైపూర్ నుంచి వచ్చిన ఓ మహిళ క్యాబ్ కోసం రాజీవ్ చౌక్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఉదయం 11 గంటల సమయంలో ఓ వ్యక్తి తన ప్యాంటు జిప్ విప్పి హస్తప్రయోగం ప్రారంభించాడు. ఆ మహిళ ఈ మొత్తం సంఘటనను తన ఫోన్ లో రికార్డ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది.
Read Also: పానీ పూరీల కోసం రోడ్డుపై కూర్చోని ధర్నా చేసిన మహిళ.. కారణం తెలిస్తే నవ్వు ఆగదు!