SL vs Ban, Super Fours: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… నేటి నుంచి సూపర్ ఫోర్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఈ సూపర్ ఫోర్ ఫైట్ లో మొత్తం నాలుగు జట్లు తలపడతాయి. ఇందులో ఇవాళ… శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మొట్టమొదటి మ్యాచ్ జరగనుంది. గ్రూప్ బి లో అద్భుతంగా రాణించిన ఈ రెండు జట్లు సూపర్ ఫోర్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది.
చివరి దశలో సూపర్ ఫోర్ కు చేరుకున్న బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య ఇవాళ… మొదటి మ్యాచ్ జరగనుంది. సోనీ లీవ్ లో ప్రసారం కానున్న ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు… తదుపరి స్టేజ్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. కాబట్టి రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. గత రికార్డులు పరిశీలిస్తే.. బంగ్లాదేశ్ కంటే శ్రీలంక చాలా బలంగా కనిపిస్తోంది. జయ సూర్య నేతృత్వంలో శ్రీలంక అద్భుతంగా ముందుకు వెళ్తోంది. అటాకింగ్ బౌలింగ్ అలాగే బ్యాటింగ్లో దుమ్ములేపుతోంది శ్రీలంక. అయితే ఈ టోర్నమెంట్ t20 ఫార్మాట్లో జరుగుతున్న నేపథ్యంలో… చివరికి క్షణంలో ఏ జట్టైనా విజయం సాధించవచ్చు. నిన్న గ్రూప్ స్టేజీలో టీమిండియాను ఓడించినంత పని చేసింది ఒమన్.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా సూపర్ ఫోర్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ సూపర్ ఫోన్లో భాగంగా మొత్తం ఆరు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇవాళ శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మొట్టమొదటి మ్యాచ్ జరగనుండగా… ఇక రేపు సూపర్ సండే మ్యాచ్ ఉంది. ఇందులో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగానే మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 23వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య అబుదాబిలో మ్యాచ్ ఉంటుంది. సెప్టెంబర్ 24వ తేదీన టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య దుబాయ్ లో బిగ్ ఫైట్ ఉంటుంది.
సెప్టెంబరు 25వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ అలాగే సెప్టెంబర్ 26వ తేదీన శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఇక ఈ సూపర్ ఫోర్ లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ కు వెళ్తాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28వ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనుంది. ప్రాథమిక అంచనా ప్రకారం శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య ఫైనల్ ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Asia Cup 2025 : పప్పులో కాలు వేసిన రషీద్ ఖాన్… అది ఔట్ రా బాబు అంటూ పరువు తీసిన అంపైర్
_*`🚨 Super Four Schedule ✅`*_
*20 Sep SL vs BAN*
*21 Sep IND vs PAK*
*23 Sep PAK vs SL*
*24 Sep BAN vs IND*
*25 Sep BAN vs PAK*
*26 Sep IND vs SL*_28 Sep ™1 vs ™2 🏆_ #AsiaCup2025#AFGvSL pic.twitter.com/sepPilOXqC
— 𝘛𝘩𝘦 𝘙𝘦𝘢𝘭𝘪𝘴𝘵 𝘏𝘶𝘮𝘢𝘯𝘪𝘴𝘵 ✍️ (@usamasahr) September 18, 2025