Redmi 15c| చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీ తన బడ్జెట్ ఫోన్ శ్రేణిని విస్తరించింది. కొత్తగా ఈ రేంజ్‌లో రెడ్మీ 15C 5జీ లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతానికి కొన్ని దేశాల్లో మాత్రమే ఈ ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ బలమైన హార్డ్‌వేర్, పెద్ద బ్యాటరీ, మంచి డిస్‌ప్లే ఫీచర్లను తక్కువ ధరకు అందిస్తుంది. ఈ ఫోన్ ని పోలాండ్‌లో ఇప్పుడు అందుబాటులో ఉంది. ప్రత్యేక ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.
ధర, అందుబాటు
రెడ్మీ 15C 5జీ ధర PLN 799. ఇది భారతదేశంలో రూ. 19,500 లేదా అంతకు సమానం. లాంచ్ ఆఫర్‌లో PLN 699కి లభిస్తుంది. ఇది రూ. 17,000కి దగ్గరగా ఉంది. పోలాండ్‌లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మూడు ఆకర్షణీయ కలర్లు ఉన్నాయి. అవి డస్క్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, మింట్ గ్రీన్. ఈ ఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్‌తో కూడా వస్తుంది.
పెద్ద డిస్‌ప్లే
రెడ్మీ 15C 5జీలో 6.9-ఇంచ్ డాట్ డ్రాప్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ టచ్ అనుభవం. 240Hz టచ్ సాంప్లింగ్ ఫీచర్ ఉంది. రిజల్యూషన్ 1600×720. బ్రైట్‌నెస్ 660 nits, HBM మోడ్‌లో 810 nits. TÜV Rheinland సర్టిఫికేషన్‌తో లో బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ. కంటెంట్ చూడటానికి, గేమింగ్‌కు బాగా సరిపోతుంది.
పెర్ఫార్మెన్స్, స్టోరేజ్
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ 6nm ప్రాసెస్‌తో పని చేస్తుంది. 4GB LPDDR4X RAM, 256GB eMMC 5.1 స్టోరేజ్. మైక్రోSD కార్డ్‌తో 1TB వరకు విస్తరించవచ్చు. యాప్‌లు, బ్రౌజింగ్, క్యాజువల్ గేమింగ్ స్మూత్‌గా రన్ అవుతాయి. డైలీ యూజ్‌కు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
కెమెరా సెటప్
రెడ్మీ 15C 5జీలో 50MP AI ప్రైమరీ కెమెరా ఉంది. f/1.8 లెన్స్‌తో మంచి ఫోటోలు. సెకండరీ సెన్సార్ సహాయంతో ఎన్‌హాన్స్‌డ్ ఫోటోగ్రఫీ. ఫ్రంట్‌లో 8MP సెల్ఫీ కెమెరా. f/2.0 లెన్స్‌తో వీడియో కాల్స్, సెల్ఫీలకు బాగా సరిపోతుంది. బడ్జెట్ యూజర్లకు మంచి ఫ్లెక్సిబిలిటీ.
బ్యాటరీ, చార్జింగ్
6000mAh పెద్ద బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ యూజ్. 33W ఫాస్ట్ చార్జింగ్ USB Type-C పోర్ట్‌తో. పెద్ద బ్యాటరీ ఉన్నా త్వరగా ఛార్జ్ అవుతుంది. రెండు రోజులు వాడటానికి సరిపోతుంది.
సాఫ్ట్‌వేర్, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 15, హైపర్OS 2తో రన్ అవుతుంది. 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, GPS కనెక్టివిటీ. 3.5mm హెడ్‌ఫోన్ జాక్, FM రేడియో. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్. IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్. మంచి NFC సపోర్ట్ కొన్ని రీజియన్లలో. థిక్‌నెస్ 8.2mm, వెయిట్ 211 గ్రాములు. కంఫర్టబుల్ డిజైన్.
షావోమీ రెడ్మీ 15C 5జీ బడ్జెట్ ప్రైస్‌లో బలమైన పెర్ఫార్మెన్స్, పెద్ద బ్యాటరీ, హై-రిఫ్రెష్ డిస్‌ప్లే అందిస్తుంది. ప్రాక్టికల్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్. భారతదేశంలో త్వరలో రూ. 12,990కి లాంచ్ అవ్వవచ్చు. బడ్జెట్ 5జీ ఫోన్ కోసం గొప్ప ఆప్షన్.
Also Read: వైఫై సిగ్నల్ సరిగా రావడం లేదా.. ఇలా చేస్తే ఇంట్లో ప్రతి మూలలోనూ బలమైన కవరేజ్