E-Paper
Advertisement

జాన్వీ, ఖుషీలకు నోటీసులు.. శ్రీదేవి ఆస్తి వివాదంలో సుప్రీం కీలక ఆదేశం

జాన్వీ, ఖుషీలకు నోటీసులు.. శ్రీదేవి ఆస్తి వివాదంలో సుప్రీం కీలక ఆదేశం
Advertisement

Sridevi Chennai Property Case:శ్రీదేవి..అతిలోక సుందరిగా మనందరినీ ఎంతగానో అలరించిన ఈ దివంగత నటి కుటుంబ వ్యవహారం ఇపుడు కోర్టు మెట్లెక్కింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న 2.7 ఎకరాల భూమిపై ఎప్పటి నుండో నలుగుతున్న వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది.

ఈ కేసులో శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో పాటు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, వివాదంలో ఉన్న ఆస్తిపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుత పరిస్థితినే కొనసాగించాలని కోర్టు తేల్చి చెప్పింది.

Advertisement

డిసెంబర్ 18కి  వాయిదా

జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ పల్లిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. కేసును పరిశీలించిన కోర్టు రెండు వర్గాలని కోర్టు బయట మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది.ఇక మళ్ళీ విచారణ డిసెంబర్ 18కి అంటూ వాయిదా వేసింది.

Advertisement

కేసు విషయానికి వస్తే చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న ఈ భూమిని శ్రీదేవి కుటుంబం 1988 ఏప్రిల్ 19న కొనుగోలు చేసినట్లు కోర్టు ముందు ఉన్న వివరాలు చెబుతున్నాయి. అయితే ఈ ఆస్తిలో తమకూ హక్కు ఉందంటూ ఎంసీ శివకామి, ఆమె సోదరుడు న్యాయపోరాటం ప్రారంభించారు. తమ హక్కులను లెక్క చేయకుండా ఈ అమ్మకం జరిగింది అంటూ వారు కోర్టు మెట్లు ఎక్కారు.

వారు మొదటగా మద్రాస్ హైకోర్టుకు వెళ్ళగా అక్కడ పిటిషనర్ల వాదనకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీం కోర్టు లో ఈ కేసు విచారణకు రావడంతో శ్రీదేవి కుటుంబానికి సంబంధించిన ఈ ఆస్తి వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది

బాలనటిగా మొదలైన  ప్రయాణం

శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా మొదలైన ఆమె ప్రయాణం తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.తెలుగులో ‘వేటగాడు’, ‘బొబ్బిలి పులి’, ‘జస్టిస్ చౌదరి’, ‘ఆఖరి పోరాటం’ వంటి సినిమాలతో ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యింది. బాలీవుడ్‌లో ‘మిస్టర్ ఇండియా’, ‘చాందిని’, ‘లమ్హే’ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇక చాలా గ్యాప్ తర్వాత ‘ఇంగ్లీష్ వింగ్లీష్’తో మళ్లీ తెరపైకి వచ్చిన శ్రీదేవి.. ఆ సినిమాతో మరోసారి తన నటనతో మెస్మరైజ్ చేసింది. ‘మామ్’ ఆమె చివరి సినిమా. ఆమె తర్వాత కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి వచ్చారు.జాన్వీ ‘ధడక్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించారు.

ఈ కేసు ఎటు వెళ్తుందో

ఇలా శ్రీదేవి కుటుంబానికి సంబంధించిన ఓ పాత ఆస్తి వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు రావడం ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. అయితే ఈ కేసులో తుది తీర్పు ఇంకా రాలేదు. డిసెంబర్ 18న జరిగే  విచారణలో ఈ కేసు ఎటు వెళ్తుందో చూడాలి.

ALSO READ:సుమ అంటే ఎందుకంత క్రేజ్? ఉదయభాను కామెంట్స్ వైరల్

Tags

Related News

సంగీత సామ్రాజ్ఞి కథలో నేషనల్ క్రష్.. రష్మిక కొత్త అవతారం!

సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. CBFCలో చోటు దక్కించుకున్న సుప్రియ యార్లగడ్డ

‘కాంతారా’ బ్యూటీకి అవార్డు.. రుక్మిణీ వసంత్ స్పెషల్ పోస్ట్ వైరల్!

ఎల్లమ్మలో దేవిశ్రీకి జోడీ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్టే!

దేవికా రాణి నుంచి మోహన్‌లాల్ వరకు.. దాదాసాహెబ్ ఫాల్కే లిస్ట్ ఇదే!

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!

ఏష నాగుల పాటకి కీర్తి సురేష్ రెమ్యునరేషన్.. వామ్మో అంత తీసుకుందా?

Big Stories

Advertisement
×