E-Paper
Advertisement

ట్రోఫీ విషయంలో పాకిస్తానే కరెక్ట్..BCCIపై విషం కక్కిన ఇండియన్ జర్నలిస్ట్ !

ట్రోఫీ విషయంలో పాకిస్తానే కరెక్ట్..BCCIపై విషం కక్కిన ఇండియన్ జర్నలిస్ట్  !
Advertisement

Vikrant Gupta On Trophy chor Naqvi:  మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) విజేతగా టీమిండియా నిలిచింది. మొన్న ఆదివారం రోజున ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ జరిగింది. ఈ టోర్నమెంటు ఫైనల్స్ లో టీమిండియా మహిళలు, శ్రీలంక జట్టు పాల్గొంది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా… 72 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. దీంతో ఎనిమిదో సారి ఆసియా కప్ ఛాంపియన్ గా నిలిచింది మహిళల టీమిండియా. అయితే ట్రోఫీ మాత్రం తీసుకోకుండానే ఇండియాకు వచ్చేసింది. BCCI ఆదేశాల మేరకు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోకూడదని.. ఉత్త చేతులతోనే ఇండియాకు వచ్చేశారు క్రికెటర్లు. అయితే దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఇండియాదే తప్పని కొంతమంది అంటుంటే.. మరి కొంతమంది మొహ్సిన్ నఖ్వీ మిస్టేక్ ఉందని పేర్కొంటున్నారు.

ట్రోఫీ విషయంలో పాకిస్తానే కరెక్ట్..BCCIపై విషం కక్కిన ఇండియన్ జర్నలిస్ట్ !

గత నాలుగు రోజులుగా ఆసియా కప్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన ట్రోఫీ చోర్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బీసీసీఐని తప్పుపడుతూ ఇండియన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రోఫీ తీసుకురాకుండా.. ఉత్త చేతులతో వచ్చిన టీమిండియాను విమర్శిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రోటోకాల్ ప్రకారం మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ఎవరైనా ట్రోఫీ తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు.

Advertisement

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

పాకిస్తాన్ దేశానికి ప్రతినిధిగా మొహ్సిన్ నఖ్వీని ట్రీట్ చేయకుండా…ACC చైర్మన్ హోదాలో ఉన్నారన్న విషయాన్ని బీసీసీఐ ఎందుకు మరిచిపోయిందని నిలదీశారు. ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ జరుగుతున్న క్రమంలో మొహ్సిన్ నఖ్వీతో బిసిసిఐ ప్రతినిధులు రాసుకొని మూసుకొని తిరిగారని ఫైర్ అయ్యారు. కానీ ట్రోఫీ విషయంలో మాత్రం భరించారని ఆగ్రహించారు. ప్రతి చిన్న విషయాన్ని టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వివాదంగా చూడకూడదని చురకలు అంటించారు.

Advertisement

భౌతికంగా ట్రోఫీ ఎక్కడ ఉందనే దానికంటే… మైదానంలో గెలిచిన ఇండియా అసలైన ఛాంపియన్ అని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో అనవసర వివాదాలకు ఇక్కడితో ముగింపు పలకాలని అభిమానులకు కూడా సూచనలు చేశారు. అయితే బీసీసీఐ తో పాటు టీమ్ ఇండియా జట్టును ట్రోఫీ విషయంలో తప్పు పట్టిన భారత జర్నలిస్టు విక్రాంత్ గుప్తాను క్రికెట్ అభిమానులు టార్గెట్ చేశారు. నోటికి ఏది వస్తే అది వాడడం మానుకోవాలని చురకలు అంటిస్తున్నారు. టీమిండియా తప్పు అన్న వాళ్ళందరూ దేశద్రోహులే అని కౌంటర్లు కూడా పేల్చుతున్నారు. ఇండియాలో పుట్టి పెరిగి.. ఇక్కడి డబ్బులతో ఎదిగిన విక్రాంత్ గుప్తా… ఇలాంటి వెధవ వేషాలు వేస్తే… తొక్కి పట్టి నార తీస్తామని హెచ్చరిస్తున్నారు. ఇకపై ఇలాంటి వాగులు వాగితే.. ఇండియాలో అడుగుపెట్టకుండా చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

Related News

ఒరేయ్ నఖ్వీ…ట్రోఫీలు కాదు, దమ్ముంటే అభిషేక్ శర్మ బ్యాట్లు దొంగతనం చెయ్

విండీస్‌తో సిరీస్‌లు..హార్దిక్, పంత్ కు నిరాశ, టీమిండియా జట్ల ప్రకటన..షెడ్యూల్ ఇదే

సంజు బ్యాట్ లో చిప్స్ పెట్టారు..అందుకే ఆఫ్గనిస్తాన్ పై ఊచకోత కోశాడు

IPL కాంట్రాక్టులు పోతాయనే భయంతో టీమిండియా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడింది

రోహిత్ శర్మ రొమాంటిక్ సెన్స్ లేదు.. బెడ్ రూమ్ లో అతను చాలా వీక్ !

బుమ్రా బౌలింగ్ లో 6 బంతుల్లో ఆరు సిక్సర్లు కొడతా…రజావుల్లా షాకింగ్ కామెంట్స్

జాక్ కాలిస్ లాంటోడు…నితీష్ కుమార్ ను అస్సలు వదులుకోవద్దు – పాక్ మాజీ ప్లేయర్

Big Stories

Advertisement
×