E-Paper
Advertisement

సుమ అంటే ఎందుకంత క్రేజ్? ఉదయభాను కామెంట్స్ వైరల్

సుమ అంటే ఎందుకంత క్రేజ్? ఉదయభాను కామెంట్స్ వైరల్
Advertisement

Udaya Bhanu Comments on Suma:ఉదయభాను..ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేదేమో ..కానీ ఒకప్పుడు యాంకర్‌గా ఈ అమ్మడు ఎంతలా బుల్లితెరపై సందడి చేసిందో చెప్పక్కర్లేదు.ఇక తాజాగా పంచనామా అనే వెబ్ సిరీస్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఉదయభాను ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో ఉదయ భాను ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు, తన తోటి యాంకర్ సుమపై చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

సుమ చాలా తెలివైన అమ్మాయి

Advertisement

ముఖ్యంగా ప్రముఖ యాంకర్ సుమ గురించి ఉదయభాను చేసిన కామెంట్స్ పైనే అందరి దృష్టి పడింది. సుమ చాలా తెలివైన అమ్మాయి అని, అందుకే ఇన్ని సంవత్సరాలుగా అన్ని రకాల షోలను అంత విజయవంతంగా రన్ చేయగలుగుతోందని ఆకాశానికి ఎత్తేసింది. బుల్లితెరపై దశాబ్దాల కాలంగా సుమ సాధించిన సక్సెస్ వెనుక ఆమె స్మార్ట్‌నెస్, సమయస్ఫూర్తి ఉన్నాయని మెచ్చుకుంది ఉదయభాను

నటీనటుల గురించి మాట్లాడుతూ

అలాగే తెలుగు ఇండస్ట్రీలోని నటీనటుల గురించి మాట్లాడుతూ మన దగ్గర అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ఉన్న ఆర్టిస్టులకు కొదవలేదని, కానీ వారికి తగిన అవకాశాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో అక్కడి నటులకు ఇచ్చే గుర్తింపు, క్యారెక్టర్ డెప్త్ మన తెలుగు సినిమాల్లోనూ మన నటులకు దక్కాలని కోరుకున్నారు. ఎంతటి క్లిష్టమైన షాట్ అయినా సింగిల్ టేక్‌లో చేసే టాలెంటెడ్ నటులు మన మధ్యే ఉన్నారంటూ గుర్తుచేసుకుంది.

వెస్లీ కాలేజ్ నుంచి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్

Advertisement

ఇక తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ తన భర్త ఇచ్చిన ధైర్యాన్ని, మద్దతును ఎమోషనల్‌గా గుర్తు చేసుకున్నారు. వెస్లీ కాలేజ్ నుంచి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయిన ఆయన, తన జీవితంలో తండ్రి స్థానాన్ని భర్తీ చేశారని చెప్పారు. ఒక భర్తగా కంటే మంచి స్నేహితుడిగా తన ప్రతి కష్టసుఖాల్లో తోడుగా నిలిచారని, ఆయన లభించడం తన పూర్వజన్మ సుకృతమని ఎమోషనల్ అయ్యారు.

సరికొత్త కథలతో రీ-ఎంట్రీ

కామెడీ యాక్టర్ బ్రహ్మానందం గారితో తనకున్న అనుబంధాన్ని, రాకేష్ మాస్టర్ గారితో ఉన్న పరిచయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో అల్లు అర్జున్ సరసన ‘బన్నీ’, ‘జులాయి’ చిత్రాల్లో గ్లామరస్ స్పెషల్ సాంగ్స్‌తో అలరించిన ఉదయభాను, ‘లీడర్’ సినిమాలోనూ తన డ్యాన్స్‌తో మెప్పించిన సంగతి తెలిసిందే. కేవలం డ్యాన్స్ లేదా యాంకరింగ్ మాత్రమే కాకుండా, కంటెంట్‌కు ప్రాధాన్యత ఉండే వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ప్రాజెక్టుల ద్వారా సరికొత్త కథలతో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చారు.

ALSO READ:‘కాంతారా’ బ్యూటీకి అవార్డు.. రుక్మిణీ వసంత్ స్పెషల్ పోస్ట్ వైరల్!

ఒకవైపు సుమ టాలెంట్, మరోవైపు తెలుగు ఆర్టిస్టుల ఆవేదన, ఇంకోవైపు తన భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచిన ఉదయభాను ఇంటర్వ్యూలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి .మరి భవిష్యత్తులో ఆమె ఎలాంటి విభిన్నమైన ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకు ముందుకు వస్తారో చూడాలి!

Tags

Related News

నందుస్ వరల్డ్ డైమండ్ షోరూమ్ వీడియో.. ఊహించని రీతిలో ట్రోలింగ్!

ఈశ్వర్ సాయి మాధురి వివాదం.. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఈశ్వర్ సాయి వైఫ్ శరణ్య!

హీటెక్కించిన కెప్టెన్సీ రేస్.. భయం పుట్టిస్తున్న ఆటలు!

అభిమానులకు పండు మాస్టర్ రిక్వెస్ట్.. ప్లీజ్ ఆ పని చేయండంటూ!

బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి మాట ఎలా రికార్డ్ అవుతుందో తెలుసా?

ఆ స్వేచ్ఛ ఇప్పుడు లేదు.. అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

రైతుబిడ్డ ఝాన్సీ పై ట్రోల్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన తల్లి!

Big Stories

Advertisement
×