E-Paper
Advertisement

సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. CBFCలో చోటు దక్కించుకున్న సుప్రియ యార్లగడ్డ

సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. CBFCలో చోటు దక్కించుకున్న సుప్రియ యార్లగడ్డ
Advertisement

CBFC: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చేసింది.18 మందితో కొత్త సభ్యులతో నూతన బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. CBFC ఛైర్మన్‌ శశి శేఖర్ వేంపటి నేతృత్వంలో నూతన బోర్డు పని చేస్తుందని తెలియజేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్యానెల్ తదుపరి మూడు సంవత్సరాలు లేదా మరొక కొత్త పానెల్ ఏర్పాటు అయ్యే వరకు ఈ 18 18 మంది నూతన సభ్యులతో కొనసాగుతుందనికేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది.

18 మంది కొత్త సభ్యులతో నూతన బోర్డు ఏర్పాటు..

నూతన బోర్డులో బాలీవుడ్ నటులు ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి, బంగాలీ నటుడు ప్రొసేన్‌జిత్ ఛటర్జీ, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, గ్రామీ అవార్డు విజేత, సంగీత దర్శకుడు రికీ కేజ్ సినీ విమర్శకుడు వినోద్ అనుపమ్, నటుడు మనోజ్ జోషి, టాలీవుడ్ సినీ నిర్మాత సుప్రియ యార్లగడ్డ, గాయకుడు, మాజీ ఎంపీ హన్సరాజ్ హన్స్, దర్శకుడు అభిషేక్ జైన్, కవి, రచయిత యతీంద్ర మిశ్రా, నటి రూపాలీ గంగూలీ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చేసిన ఈ సెన్సార్ బోర్డ్ లో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సుప్రియ యార్లగడ్డ సైతం చోటు దక్కించుకోవటం విశేషం. ఇకపోతే పాత బోర్డు మెంబర్లలో పని చేసిన వారిలో దర్శకుడు వామన్ కేంద్రే, రచయిత రమేష్ పతంగేలకు మాత్రమే తాజా కమిటీలో మళ్లీ అవకాశం దక్కింది.

ఏడు సంవత్సరాల తర్వాత CBFC పునర్వ్యవస్థీకరణ..

Advertisement

సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952లోని సెక్షన్ 3(1), సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) రూల్స్, 2024 నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టింది. ఆగస్టు 2017వ సంవత్సరంలో సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ చేశారు .దాదాపు 9 సంవత్సరాలు తర్వాత తిరిగి సెన్సార్ బోర్డును పునర్వ్యవస్థీకరణ చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కమిటీలు ఎక్కువగా సినిమా అలాగే సంగీత రంగాలకు చెందిన అగ్రసేణి దిగ్గజాలకు పెద్దపీట వేశారు. గత కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి గౌతమి, జీవిత రాజశేఖర్ ,వివేక్ అగ్నిహోత్రి, విద్యాబాలన్ వంటి తదితరుల పదవీకాలం ముగియడంతో వారికి ఉద్వాసం పలికారు. ఇటీవల కాలంలో సినిమాటిక్ సెన్సార్ షిప్ వివాదాలు నిత్యం రగులుతున్న నేపథ్యంలో నన్ను తన కమిటీని ఏర్పాటు చేశారు మరి ఈ నూతన కమిటీ తీసుకోబోతున్న నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనేది తెలియాల్సి ఉంది.

Also Read: బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!

Related News

‘కాంతారా’ బ్యూటీకి అవార్డు.. రుక్మిణీ వసంత్ స్పెషల్ పోస్ట్ వైరల్!

ఎల్లమ్మలో దేవిశ్రీకి జోడీ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్టే!

దేవికా రాణి నుంచి మోహన్‌లాల్ వరకు.. దాదాసాహెబ్ ఫాల్కే లిస్ట్ ఇదే!

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!

ఏష నాగుల పాటకి కీర్తి సురేష్ రెమ్యునరేషన్.. వామ్మో అంత తీసుకుందా?

నటుడు అనంత్ నాగ్ కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం!

జాన్వీ కపూర్ లుక్ అదిరిందిగా.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×