Rukmini Vasanth: రుక్మిణీ వసంత్.. ఈ పేరు ఇపుడు ప్యాన్ ఇండియా వైడ్ గా ఒక సెన్సేషన్.తన దైన అందంతో పాటు నటనతో కూడా కట్టిపడేసే ఈ భామ ఇపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వార్త ద్వారా మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అవును .. ఈ మధ్యే జరిగిన ‘సైమా’ (SIIMA) అవార్డ్స్ వేడుకలో రుక్మిణీ వసంత్‌కు కాంతారా చాప్టర్ 1 లో చేసిన కనకవతి పాత్రకి స్పెషల్ గా అవార్డ్ వచ్చిన సంగతి తెల్సిందే.
ఇక ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పోస్ట్ రూపంలో బయట పెట్టేసింది. ఈ సందర్భంగా డార్క్ మెరూన్ చీరకట్టులో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. “సైమా అవార్డ్స్‌కు, నాతో పాటు మా చిత్రాన్ని, కనకవతి పాత్రను ఆదరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అంటూ పోస్ట్ పెట్టింది. ఈ ఫోటోలలో ఆమె ట్రెడిషనల్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతు కామెంట్ల వర్షం కురిపించడంతో సోషల్ మీడియాలో ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
రుక్మిణీ 2019లో ‘బిర్బల్ ట్రయాలజీ’తో కన్నడ ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ, ఆమె అసలు కెరీర్‌ను టర్న్ చేసిన సినిమా మాత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో’ (Sapta Sagaradaache Ello). హేమంత్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీలో ‘ప్రియ’గా రుక్మిణీ ఇచ్చిన ఫెర్ఫామెన్స్ టాప్ నాచ్. ఈ పాత్రకు ఇప్పటికే ఆమెకు సైమా క్రిటిక్స్, ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్, ఐఫా (IIFA) ఉత్సవం వంటి అవార్డులు దక్కాయి కూడా.
అయితే ఒకే ఇండస్ట్రీకి పరిమితం కాకుండా కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో రుక్మిణీ వరుస అవకాశాలను అందుకోవడం ఇక్కడ విశేషం. కన్నడలో ‘బానదారియల్లి’, ‘బఘీరా’, ‘భైరతి రణగల్’ వంటి హిట్స్ అందుకున్న ఈ కన్నడ భామ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే తమిళంలో ‘ఏస్’, ‘మధరాసి’ సినిమాలలో నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలో పాగా వేసే పనిలో పడింది.
అయితే అన్నింటి కన్నా మించి రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ‘కాంతారా: చాప్టర్ 1’ సినిమాలో చేసిన కనవతి పాత్రతో ఒక్కసారిగా టాప్ లీగ్ లోకి దూసుకొచ్చేసింది. గ్లామర్ పాత్రలకు దూరంగా, కథలో ఎంతో కీ రోల్ పోషించే కనవతి పాత్ర తో దేశవ్యాప్తంగా రుక్మిణీ పేరు మారు మ్రోగిపోయింది. ఇక తాజాగా సైమా వేదికగా లభించిన ఈ గౌరవాన్ని కూడా తన ‘కనకవతి’ పాత్రకు, ‘కాంతారా’ టీమ్‌కు అంకితం ఇవ్వడం విశేషం.
ALSO READ:ఎల్లమ్మలో దేవిశ్రీకి జోడీ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్టే!
అయితే రాక్ స్టార్ యష్ కాంబినేషన్‌లో గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వచ్చిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic) లో రుక్మిణీ ఒక కీలక పాత్రలో కనిపించగా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ సంగతి తెల్సిందే.ఏది ఏమైనా విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రతి ఇండస్ట్రీలోనూ ముద్ర వేస్తున్న రుక్మిణీ వసంత్ రాబోయే రోజుల్లో మరింత ఎత్తుకు ఎదుగుతుంది అనడంలో సందేహమే లేదు !