Ellamma Heroine:తనదైన సాలిడ్ మ్యూజిక్ తో ఎన్నో సినిమాలని సూపర్ డూపర్ హిట్స్ చేసిన దేవీ శ్రీ ప్రసాద్ ఇపుడు హీరోగా మారిన సంగతి తెల్సిందే. బలగం సినిమాతో సంచలన విజయం సాధించిన వేణు ఎల్దండి దర్శకత్వంలో వస్తున్న ఎల్లమ్మ సినిమాలో దేవీ హీరోగా నటిస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి వరకు కూడా తేలకపోవడంతో అసలు ఈ సినిమాలో దేవీ శ్రీ పక్కన నటించేది ఎవరా అంటూ ఆరాలు తీసేపనిలో పడ్డారు మూవీ లవర్స్.
అయితే తాజాగా ఈ సినిమాలో దేవిశ్రీకి జోడీగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్ హీరోయిన్ గా నటించబోతుందన్న వార్త ఇపుడు ఫిలిం నగర్ లో జోరుగా చక్కర్లు కొడుతుంది.ఇప్పటికే 8 వసంతాలు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ తాజాగా రోమాంచకం సినిమాతో మరోమారు పలకరించిన సంగతి తెల్సిందే. ఇక ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ పాత్రకి మంచి స్కోప్ ఉండటంతో వేణు ఏరికోరి మరీ ఈ బ్యూటీని సెలెక్ట్ చేశాడనే ఇండస్ట్రీలో నడుస్తోంది.
అయితే మేకర్స్ నుండి ఇప్పటి వరకు ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఎలాంటి అప్ డేట్ రాలేదు.మరి నిజంగానే అవంతిక ఆన్ బోర్డ్ అయిందా లేక రూమర్సా అన్నది మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే కాని తెలీదు. ఇక ఎల్లమ్మ సినిమా విషయానికి వస్తే సినిమాను తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో,తెలంగాణా సంస్కృతి మీద ప్లాన్ చేశాడు వేణు .
ఇక ఇదే విషయాన్ని ఇప్పటికే వదిలిన గ్లిప్మ్స్ చెబుతుంది కూడా. ముఖ్యంగా పల్లె జీవితం, ప్రేమ, కుటుంబ బంధాలు, అక్కడి మనుషుల మధ్య ఉండే అనుబంధాలు సినిమాలో ప్రధానంగా కనిపించే అవకాశం ఉందని సమాచారం. ‘బలగం’లో తెలంగాణ నేటివిటీని చాలా సహజంగా చూపించిన వేణు యెల్దండి.. ఈసారి కూడా అదే ఫీల్ ని రిపీట్ చేయబోతున్నాడట.
ఇక దేవిశ్రీ ప్రసాద్ విషయానికి వస్తే.. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆయనకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘వర్షం’, ‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’, ‘జల్సా’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ లాంటి ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించాడు. ఇప్పుడు మొదటిసారి హీరోగా నటించడంతో ఆయన అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ‘ఎల్లమ్మ’ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా సంగీతం అందిస్తున్నాడు. అంటే హీరోగా కూడా కనిపిస్తూ.. సినిమాకు మ్యూజిక్ కూడా ఆయనే ఇవ్వబోతున్నాడు. ఇక ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. .
ALSO READ:దేవికా రాణి నుంచి మోహన్‌లాల్ వరకు.. దాదాసాహెబ్ ఫాల్కే లిస్ట్ ఇదే!
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందని ఇన్ సైడ్ టాక్ . చూడాలి …ఈ అప్ డేట్ పై మేకర్స్ ఏమంటారో !