E-Paper
Advertisement

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!
Advertisement

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఇటీవల ఈయన బుచ్చిబాబు డైరెక్షన్లో నటించిన పెద్ద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో తదుపరి రాబోయే రామ్ చరణ్(Ram Charan) సుకుమార్(Sukumar) కాంబినేషన్లో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోబోతుందని తెలుస్తుంది. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ అంటేనే సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆది పురుష్ డైరెక్టర్ తో రామ్ చరణ్..

ఇక పుష్ప సినిమా తర్వాత సుకుమార్ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. పుష్ప సినిమా తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తదుపరి దర్శకుడు ఎవరు? అనే విషయం పై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తదుపరి డైరెక్టర్ల జాబితాలో చాలామంది దర్శకుల పేర్లు వినపడుతూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ పేరు కూడా లిస్టులోకి రావడం గమనార్హం. రామ్ చరణ్ సుకుమార్ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ తో చేయబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

పిరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా..

Advertisement

రామ్ చరణ్ చేయబోయే ఆ బాలీవుడ్ డైరెక్టర్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే… ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది పురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ (Om Rauth) దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇటీవల డైరెక్టర్ ఓం రౌత్ చరణ్ కు ఒక కథ చెప్పడంతో చరణ్ ఆ కథకు ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమా ఒక పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.

డిజాస్టర్ డైరెక్టర్ పై అంత నమ్మకం ఏంటన్న…

ఓం రౌత్ గత సినిమాల మాదిరిగానే భారీ విజువల్స్ గ్రాఫిక్స్ తో ఈ సినిమా ఉండబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. పోయి పోయి డిజాస్టర్ డైరెక్టర్ తో సినిమా చేయడం ఏంటన్న అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరికొందరు ఓం రౌత్ తో సినిమా వద్దు బాబోయ్ అంటూ దండం పెట్టేస్తున్నారు. ఇప్పటికే ఇతర భాష డైరెక్టర్ లతో సినిమా చేసి గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ అందుకున్నది చాలు మళ్ళీ ఇంకో డిజాస్టర్ డైరెక్టర్ తో సినిమా వద్దు అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Also Read: నటుడు అనంత్ నాగ్ కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం!

Related News

ఏష నాగుల పాటకి కీర్తి సురేష్ రెమ్యునరేషన్.. వామ్మో అంత తీసుకుందా?

నటుడు అనంత్ నాగ్ కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం!

జాన్వీ కపూర్ లుక్ అదిరిందిగా.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

సెన్సార్ పూర్తి చేసుకున్న ది ప్యారడైజ్.. రన్ టైం ఎంతంటే?

ఇరుముడి దెబ్బకు శివ నిర్వాణ రేంజ్ మారిపోయిందా.. ఏకంగా చిరంజీవితో?

వేల కోట్ల స్కామ్.. ఇప్పుడు పూట గడవడం లేదు.. ఆర్థిక కష్టాల్లో ఐబొమ్మ రవి!

లండన్ లో జంటగా త్రిష విజయ్..త్రిష స్థానంలో నేనుంటే ఆ పని చేయను.. నటి ఫైర్!

Big Stories

Advertisement
×