E-Paper
Advertisement

ఏష నాగుల పాటకి కీర్తి సురేష్ రెమ్యునరేషన్.. వామ్మో అంత తీసుకుందా?

ఏష నాగుల పాటకి కీర్తి సురేష్ రెమ్యునరేషన్.. వామ్మో అంత తీసుకుందా?
Advertisement

Keerthy Remuneration:పక్కింటి అబ్బాయిగా పాతుకుపోయిన నాని రూట్ మార్చాడు .దసరా,హిట్ 3 సినిమాలతో యాక్షన్ బాట పట్టిన మన న్యాచురల్ స్టార్ ఇపుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే.ఇక రీసెంట్ గా ఈ సినిమా నుండి ‘ఏష నాగుల’ మాస్ ఫోక్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాని ఎలా షేక్ చేస్తుందో చెప్పక్కర్లేదు.

17 రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్

అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వంలో , కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటని జంగి రెడ్డి ,ప్రభ లు పాడగా ఆట సందీప్ కొరియోగ్రఫీ అందించారు.ఇక డల్లాస్‌లోని అనిరుధ్ మ్యూజికల్ కాన్సర్ట్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ పాట వచ్చిన కొత్తల్లో నెగెటివ్ టాక్ ని మూట గట్టుకుంది.కోరియోగ్రఫీ సరిగ్గా లేదని ,పాటలో తెలంగాణ ఫోక్ టచ్ మిస్ అయిందని ..ఇలా ఇబ్బడి ముబ్బడిగా పాటపై విమర్శలు వచ్చాయి.అయితే వాటన్నింటిని దాటుకుని ఈ పాట అలా రిలీజ్ అయిన 17 రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టి ఈ రికార్డ్ సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ ని సొంతం చేసుకుంది.

కీర్తి ఎంత పుచ్చుకుని ఉంటుందా

Advertisement

ఇక ఇదిలా ఉంటె ఈ పాటలో నానితో పాటు ఊర మాస్ స్టెప్పులతో కీర్తి సురేష్ కూడా అదరగొట్టిన సంగతి తెల్సిందే.మాములుగా స్పెషల్ అప్పియరెన్స్, గ్లామర్ పాత్రలకు, స్పెషల్ డాన్స్ నంబర్లకు నో చెప్పే కీర్తి ఈ సాంగ్ లో తళుక్కుమనడంతో అసలు ఈ పాట కోసం కీర్తి ఎంత పుచ్చుకుని ఉంటుందా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు మూవీ లవర్స్.

దాదాపు 70 లక్షల రూపాయల పారితోషికం?

అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ఈ ఏష నాగుల పాటకి గాను కీర్తి సురేష్ అక్షరాల రెండు రోజుల కాల్ షీట్స్ కి గాను దాదాపు 70 లక్షల రూపాయల పారితోషికం అందుకున్నట్టు వినిపిస్తుంది. పైగా ‘నేను లోకల్’, ‘దసరా’ సినిమాలలో నానితో నటించడం వల్ల, ఆ స్నేహం కారణంగా మాత్రమే ఈ పాటలో కీర్తి నటించేందుకు ఒప్పుకుందని తెలుస్తుంది.అయితే మేకర్స్ నుండి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ లేకపోవడంతో ఇది రూమర్‌గానే చూడాలి.

సెప్టెంబర్ 24, 2026న వరల్డ్ వైడ్ గా రిలీజ్

Advertisement

ఇక సినిమా విషయానికి వస్తే ..’దసరా’ వంటి సాలిడ్ హిట్ తర్వాత అదే కాంబోలో ఈ ‘ది ప్యారడైజ్’ వస్తుండటం తో అంచనాలు భారీగానే పెరిగాయి. ఇందులో శిఖంజా మాలిక్ గా మోహన్ బాబు కీ రోల్ పోషిస్తుండగా రాఘవ్ జుయల్, కాయదు లోహర్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ALSO READ:జాన్వీ కపూర్ లుక్ అదిరిందిగా.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

ఇక ఇప్పటికే సినిమా నుండి మొదటగా రిలీజ్ అయిన ‘ఆయా షేర్’ పాటతో పాటు ‘ఏష నాగుల’కూడా సూపర్ హిట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. చూడాలి మరి సెప్టెంబర్ 24, 2026న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో !

Tags

Related News

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!

నటుడు అనంత్ నాగ్ కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం!

జాన్వీ కపూర్ లుక్ అదిరిందిగా.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

సెన్సార్ పూర్తి చేసుకున్న ది ప్యారడైజ్.. రన్ టైం ఎంతంటే?

ఇరుముడి దెబ్బకు శివ నిర్వాణ రేంజ్ మారిపోయిందా.. ఏకంగా చిరంజీవితో?

వేల కోట్ల స్కామ్.. ఇప్పుడు పూట గడవడం లేదు.. ఆర్థిక కష్టాల్లో ఐబొమ్మ రవి!

లండన్ లో జంటగా త్రిష విజయ్..త్రిష స్థానంలో నేనుంటే ఆ పని చేయను.. నటి ఫైర్!

Big Stories

Advertisement
×