SSMB 29:దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli ) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబి 29’. సూపర్ స్టార్ మహేష్ బాబు(Maheshbabu ) హీరోగా పాన్ వరల్డ్ రేంజ్ లో రాబోతున్న ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ ప్రాజెక్టుపై ఎప్పటినుంచో అంచనాలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. అటు రాజమౌళి కూడా ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇంటర్నేషనల్ లెవెల్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమా గురించి వినిపించే ఏ న్యూస్ అయినా సరే క్షణాలలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం గ్లోబ్ ట్రాటర్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా గురించి తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.. అదేమిటంటే మహేష్ బాబు రాజమౌళి క్రేజీ ప్రాజెక్టు ఇటీవలే కెన్యా షెడ్యూలు కంప్లీట్ చేసుకుంది. అక్కడ షూటింగ్ కి సంబంధించి లీకైన ఫోటోలు ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో కర్ర పట్టుకొని మహేష్ బాబు కనిపించిన లుక్ నెక్స్ట్ లెవెల్.. మరొకవైపు సింహం పక్కన మహేష్ బాబు నడుస్తున్న ఫోటో కూడా లీక్ అవ్వడంతో మరింత అంచనాలు పెరిగిపోయాయి. కేవలం లీకైన ఫోటోలకే ఈ రేంజ్ లో వైబ్ ఉందంటే.. ఒరిజినల్ పోస్టర్స్ వస్తే ఇక ఆ వైబ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
నెక్స్ట్ షూటింగ్ అక్కడే..
కొద్ది రోజులుగా కెన్యాలో షెడ్యూల్ జరుగుతూ ఉండగా.. అక్కడ అడవుల్లో భారీ చేజింగ్ సీన్స్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్లను కూడా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ అక్కడ పూర్తయింది. ఇక దీంతో నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ అని అభిమానులు తెగ తెలుసుకొనే ప్రయత్నం చేయగా.. ఈ షెడ్యూల్ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఈ షూటింగ్ కాశీ క్షేత్రానికి సంబంధించింది అని సమాచారం. ఈ సినిమాలో ఉన్న మెయిల్ స్టార్స్ అందరూ కూడా ఈ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.
అక్టోబర్ 10 వరకూ..
ఇక్కడ అక్టోబర్ 10 వరకు షూటింగ్ జరగనుంది అని, ఫస్ట్ ఆఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలను ఇప్పుడు ఇక్కడ షూటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా దాదాపు 50% షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లే అని విశ్లేషకులు కూడా చెబుతున్నారు.. దీనికి తోడు నవంబర్లో ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వదులుతానని రాజమౌళి కూడా క్లారిటీ ఇచ్చారు. మరి ఈ సినిమా నుంచి వదిలే అప్డేట్ మరెన్ని అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. మరోవైపు వేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసి.. 2026 చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుందని దాదాపు రూ.1200 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.
ALSO READ:Bigg Boss 9: కామనర్స్ కి ఇచ్చి పడేసిన నాగ్.. ఇంత పార్శియాలిటీనా?