 
					Bahubalu The Epic: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి రీ రిలీజ్ సమయంలో కూడా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టాయి. ఈ క్రమంలోనే రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో ప్రభాస్(Prabhas), రానా(Rana) హీరోలుగా నటించిన బాహుబలి సినిమా 10 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా విడుదల అయ్యి పది సంవత్సరాలు అయిన నేపథ్యంలో చిత్ర బృందం మరోసారి ఈ సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
బాహుబలి సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ (Bahubali The Epic)పేరిట ఓకే సినిమాగా విడుదల చేయడంతో ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇలా రెండు భాగాలు కలిపి ఒకేసారి విడుదలైన నేపథ్యంలో ప్రభాస్ రానా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే మరొక హీరో అభిమానులు బాహుబలి చిత్ర బృందం పై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి సినిమాలో కన్నడ నటుడు సుదీప్ కిచ్చా (Sudeep Kiccha)అస్లామ్ ఖాన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సుదీప్ కట్టప్ప మధ్య జరిగే సన్నివేశం అందరిని బాగా ఆకట్టుకుంటుంది.
ఇలా బాహుబలి ది బిగినింగ్స్ లో సుదీప్ కు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి కానీ ది ఎపిక్ సినిమాలో ఈ సన్నివేశాలను తొలగించిన నేపథ్యంలో కన్నడ అభిమానులు బాహుబలి టీం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మా హీరోకి సంబంధించిన సన్నీ వేషాలను తొలగించడం అంటే అది మా హీరోని అవమానపరచడమే అంటూ మండిపడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాను రెండు భాగాలు కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చిందనే విషయాన్ని చిత్ర బృందం వెల్లడించారు.
తమన్నా ప్రేమ కథ తొలగింపు..
ఈ సినిమాలో పాటలతో పాటు అవంతిక పాత్రలో నటించిన తమన్నా సన్నివేశాలను కూడా తొలగించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా విడుదల చేస్తున్న నేపథ్యంలో సినిమా నిడివి ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతోనే కొన్ని సన్నివేశాలను తొలగించారే తప్ప ఇందులో మరే ఉద్దేశం లేదని చెప్పాలి. ఇలా బాహుబలి ది ఎపిక్ సినిమాకు భారీ స్థాయిలో ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా రీ రిలీజ్ విషయంలో కూడా ప్రభాస్ తన సినిమాతో అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. త్వరలోనే ఈయన నటించిన ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Also Read: Prasanth Varma : డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కోట్ల రూపాయల అడ్వాన్స్… ఫైనల్‌గా ఓపెన్ అయిన నిర్మాత