Bigg Boss 9: బుల్లితెర ప్రేక్షకులను మళ్లీ ఆకట్టుకోవడానికి బిగ్ బాస్ వచ్చేసింది. అయితే ఈసారి 9వ సీజన్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాగా.. డబుల్ హౌస్.. డబుల్ డోస్.. డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీజన్ లో నాగార్జున (Nagarjuna) ఎప్పటిలాగే మరింత ఫైర్ పుట్టిస్తున్నారు అని చెప్పవచ్చు. తాజాగా శని, ఆది వారాలకు సంబంధించిన ఎపిసోడ్స్ లో నాగార్జున కనిపించి, కంటెస్టెంట్స్ చేసిన తప్పొప్పులను బయటకు తీసి.. వార్నింగ్ ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వహకులు విడుదల చేయగా.. అందులో నాగార్జున కామనర్స్ కి ఇచ్చి పడేశారు.
తాజాగా విడుదల చేసిన ప్రోమో విషయానికి.. నిన్నటి ఎపిసోడ్ లోనే అసలు ఫైర్ చూపించిన నాగార్జున.. ఈరోజు.. కామనర్స్ కి ఇచ్చి పడేశారు. ఇక్కడ ఇంకా కొన్ని బాక్సస్ ఉన్నాయని చూపిస్తూ.. ల్యాండ్ ఓనర్స్ లో ఈక్వాలిటీ చూపించని వ్యక్తి ఎవరు? అని ప్రశ్నించగా.. శ్రష్టి వర్మ మనీష్ పేరు తెలిపింది. “నేను మనీష్ గారిని అడిగాను. నా ఆరోగ్య పరిస్థితి బాగుండదు కాబట్టి నాకు ఒక ఆపిల్ ఇవ్వండి అని అడిగాను. కానీ ఆయన టీం తో డిస్కస్ చేసి చెబుతానన్నారు”. అని ఈమె తెలుపగా.. దానికి మనీష్ మాట్లాడుతూ.. “ఆరోజు మా రూమ్లో డిస్కషన్ జరిగింది. కాకపోతే రూమ్ నుండి ఏ ఒక్క పండు బయటకు వెళ్లకూడదని చెప్పారు”.. అంటూ మనీష్ తెలిపారు.
కామనర్స్ కి ఇచ్చి పడేసిన నాగార్జున..
“మరి అరటి పళ్ళు ఎలా బయటకు వెళ్లాయి? “అని నాగార్జున ప్రశ్నించగా.. మధ్యలో ప్రియా శెట్టి మాట్లాడుతూ.. “ఆ రెండు అరటిపళ్ళు ఇచ్చింది నేనే.. రాముకి ఇచ్చాను” అని చెబుతుండగా.. నాగార్జున..”మరి శ్రష్టికి ఎందుకు ఇవ్వలేదు” అని ప్రశ్నించారు. దానికి ప్రియా శెట్టి మాట్లాడుతూ.. “మరి నాకు రిమైండ్ చేయలేదో తెలీదు” అంటూ చెప్పగానే నాగార్జున మాట్లాడుతూ..” మరి మనీష్ డిస్కస్ చేశామని చెబుతున్నారు కదా.. ఏం జరిగింది.. మతిమరుపు.. ఏదైనా మందు ఉంటే వేసుకోండి” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చారు.
అరటిపళ్ళ దొంగగా మారిన తనూజ..
ఇకపోతే గతవారం జరిగిన ఎపిసోడ్ లో తనూజ అరటిపళ్ళ దొంగగా మారిన విషయం తెలిసిందే. ఒక అరటి పండు తీసుకొచ్చి రీతు చౌదరికి దొంగతనంగా ఇచ్చింది. ఇక దీనికి రీతూ చౌదరి అరటికాయ నాకొద్దు రా బాబు అంటూ కామెంట్ చేసింది. ఆ తర్వాత రీతు చౌదరి, ఇమ్మానుయేల్, తనూజ, భరణి అరటిపళ్ళు దొంగతనం చేసిన వీడియోని నాగార్జున ప్లే చేశారు. తర్వాత ఇమ్మానియేల్ , రీతూ చౌదరి చెత్తబుట్ట దగ్గర అరటి పండు దాచే ప్రయత్నం చేయగా.. భరణి ఎవరైనా చూస్తే చెత్తబుట్టలో ఏరుకొని తింటారనుకుంటారు అంటూ కామెంట్ చేశారు. ఇంకా తర్వాత ఎలిమినేషన్ స్టార్ట్ అవ్వగా.. శ్రష్టి వర్మ ఈ వారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.