E-Paper
Advertisement

Star Couple Divorce: విడాకుల ప్రకటించిన స్టార్ కపుల్.. 16 ఏళ్ల పెళ్లి బంధానికి శుభం కార్డ్..

Star Couple Divorce: విడాకుల ప్రకటించిన స్టార్ కపుల్.. 16 ఏళ్ల పెళ్లి బంధానికి శుభం కార్డ్..
Advertisement

Star Couple Divorce: టెలివిజన్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆదర్శ దంపతులుగా గుర్తింపు పొందిన జై భానుశాలి..మహి విజ్.. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. 16 సంవత్సరాలుగా కలిసి జీవించిన ఈ జంట..ఇకపై వేర్వేరు మార్గాల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ నిర్ణయంలో ఎలాంటి ద్వేషం..నెగెటివిటీ లేదని స్పష్టంగా చెప్పారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వాళ్ళిద్దరి పోస్టులో.. “మా జీవన ప్రయాణంలో.. ఇక వేర్వేరు దారులు ఎంచుకుంటున్నాం. అయినా కూడా ఒకరికి ఒకరం అండగా ఉంటాం. శాంతి, ఎదుగుదల, దయ, మానవత్వం అనే విలువలే మాకు ఎప్పుడూ మార్గదర్శకాలు” అని పేర్కొన్నారు. ఈ మాటలు అభిమానులను బాధకు గురి చేస్తున్నాయి.

Advertisement

ముఖ్యంగా తమ పిల్లల విషయంలో.. ఇద్దరూ చాలా స్పష్టంగా మాట్లాడారు. తమ పిల్లలు తారా, ఖుషి, రాజ్‌వీర్‌ల కోసం మంచి తల్లిదండ్రులుగా..మంచి స్నేహితులుగా ఉండేందుకు.. కట్టుబడి ఉన్నామని తెలిపారు. “మేము వేరు దారుల్లో నడుస్తున్నా… ఈ నిర్ణయం వెనుక ఎలాంటి నెగిటివిటీ కానీ.. డ్రామా కానీ లేదు. మేము కేవలం ప్రశాంతతనే ఎంచుకున్నాం ” అని చెప్పారు.

Advertisement

జయ్ భానుశాలి తమ ప్రకటన చివరలో అభిమానులను ఒక చిన్న విజ్ఞప్తి చేశారు. “మేము ఒకరిని ఒకరం గౌరవించుకుంటూనే ఉంటాం. స్నేహబంధం అలాగే కొనసాగుతుంది. ఈ సమయంలో మాకు మీ ప్రేమ, గౌరవం, దయ అవసరం” అని కోరారు.

జయ్.. మహీ ఇద్దరూ తొలిసారి ఒక క్లబ్‌లో కలుసుకున్నారు. కేవలం మూడు నెలల్లోనే మహీనే తన జీవిత భాగస్వామి అని జయ్ నిర్ణయించుకున్నారని గతంలో చెప్పాడు. 2010లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం రాజ్‌వీర్.. ఖుషిలకు ఫోస్టర్ పేరెంట్స్‌గా మారారు. 2019లో ఐవీఎఫ్ ద్వారా కుమార్తె తారాకు జన్మనిచ్చారు.

2025 నుంచే వీరి మధ్య విభేదాలపై పుకార్లు వినిపించాయి. అయితే అప్పట్లో మహీ వాటిని ఖండించారు. ఇప్పుడు అధికారిక ప్రకటనతో అన్ని సందేహాలకు ముగింపు పలికారు. వేరైనా..పిల్లల కోసం కలిసి ముందుకు సాగుతామని ఈ జంట మరోసారి స్పష్టం చేసింది.

అయితే ఏకంగా 16 సంవత్సరాల తర్వాత ఈ జంట విడాకులు తీసుకోవడంతో వీరి అభిమానులు కొద్దిగా నిరాశ చెందుతున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అంటూ చింతిస్తున్నారు.‌ కారణమేదైనా ఇలాంటి ఒక అపురూపమైన జంట విడిపోవడం అందరిని నిరాశకు గురిచేస్తుంది.

ALSO READ: Naga Vamshi About Jr NTR: తారక్ అన్న వాడినదే కావాలి అని అడిగి మరి తీసుకున్నాను.. నాగ వంశీ కీలక వ్యాఖ్యలు..!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×