Ghost in Hostel: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2007లో నిర్మించిన ఈ హాస్టల్ విద్యార్థులకు నివాసం, చదువు కోసం ఏర్పాటు చేయబడింది. కానీ, క్రమంగా ఇది భయానక ప్రదేశంగా మారిపోయింది. కారణం.. హాస్టల్‌కు అతి సమీపంలోనే స్మశాన వాటిక ఉండటం, అలాగే దెయ్యాలు తిరుగుతున్నాయి అనే ప్రచారం విస్తరించడం.
హాస్టల్ పక్కనే స్మశానవాటిక
మొదట్లో హాస్టల్ నుంచి కొంత దూరంలోనే అంత్యక్రియలు జరిగేవి. కానీ ఇటీవల కొత్తగా హాస్టల్ ప్రహారీ గోడకు కేవలం 8 మీటర్ల దూరంలోనే స్మశానవాటిక నిర్మించబడింది. హాస్టల్ గదుల కిటికీ నుంచి నేరుగా కాలుతున్న శవం కనిపించే పరిస్థితి నెలకొంది. పొగ కూడా నేరుగా హాస్టల్ గదుల్లోకి చేరుతోంది. రోజూ ఎవరైనా మరణిస్తే ఇక్కడే అంత్యక్రియలు జరగడం, శవం కాలిపోతున్న దృశ్యం ప్రత్యక్షంగా కనిపించడం విద్యార్థులలో భయాన్ని రెట్టింపు చేస్తోంది.
విచిత్ర శబ్దాల ప్రచారం
స్థానికుల ప్రకారం రాత్రి పూట వింత శబ్దాలు వినిపిస్తున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. హాస్టల్ ప్రాంతంలో ఎవరో తిరుగుతున్నట్టుంది. దెయ్యాల కదలికలు వినిపిస్తున్నాయి అని స్థానికులు చెబుతున్నారు. ఈ మాటలు విద్యార్థులలో భయాన్ని మరింత పెంచాయి. గత యేడాది.. అతి కష్టం మీద.. 12 మంది విద్యార్థులు హాస్టల్లో ఉండేవారు.. ఇప్పుడు.. ఈ దెయ్యాల ఉన్నాయనే ప్రచారంతో ఒక్క విద్యార్థి కూడా ఈ హాస్టల్లో ఈ సంవత్సరం జాయిన్ కాలేదు. గతంలో ఉన్న వారు కూడా తమ సామాను వదిలిపెట్టేసి వెళ్లిపోయారు.
తల్లిదండ్రుల నిరాకరణ
వార్డెన్, అధికారులు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం రాలేదు. మా పిల్లలు ఇంత భయానక వాతావరణంలో ఎలా ఉంటారు? ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల తాము పిల్లలను అక్కడ పంపేందుకు ఇష్టపడడం లేదని స్పష్టంగా చెబుతున్నారు.
హాస్టల్ వాతావరణం
హాస్టల్ చుట్టూ పెద్ద చెట్లు, చిన్న గుట్ట, స్మశానవాటిక ఉండటంతో.. ఇక్కడ వాతావరణం భయానకంగా మారింది. రాత్రి సమయంలో బయటకు వెళ్ళడం విద్యార్థులకు అసాధ్యం. ముఖ్యంగా వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా విద్యార్థులు భయపడేవారని పూర్వవిద్యార్థులు చెబుతున్నారు. ఒకవైపు పొగ, మరోవైపు కబ్రాలు, సమాధులు ఇవన్నీ కలిపి ఓ భయానక ప్రదేశంగా మార్చేశాయి.
విద్యార్థుల భయం – తల్లిదండ్రుల ఆవేదన
మా పిల్లలు రాత్రిళ్లు నిద్రపోలేక భయంతో వణికేవారు. శబ్దాలు, దృశ్యాలు చూసి ఆందోళన చెందేవారు. అందుకే వారిని అక్కడ నుంచి తీసుకువచ్చాం అని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు.
హాస్టల్ సిబ్బంది పరిస్థితి
ఇక్కడ ఎదో తిరుగుతందనే ప్రచారం కారణంగా.. ఇక్కడ ఉండలేమని విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పుడు విద్యార్థులు లేకుండా.. హాస్టల్ ఖాళీగానే ఉంది.. కేవలం.. హాస్టల్ సిబ్బంది ఉదయం వచ్చి.. సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు. ఇది విద్యార్థులకు సౌకర్యంగా లేదని.. ఇక్కడి నుంచే వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే.. ఇక్కడికి ఒక్క విద్యార్థి కూడా రాడని చెబుతున్నారు.
Also Read: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు షాక్.. వాయిదా పడ్డ ప్రక్రియ!
ఈ హాస్టల్ పక్కన స్మశాన వాటిక ఉండటంతో.. వి ద్యార్థులు ఎవరూ ఉండటం లేదని.. వార్డెన్ తిరుపతి చెబుతున్నారు. విద్యార్థులతో పాటు.. తల్లిదండ్రులను నచ్చజెప్పే ప్రయత్నం చేశామని అంటున్నారు. కానీ.. భయంతో.. రావడం లేదని తెలుపుతున్నారు. ఇప్పుడు.. ఈ హాసళ్లో ఒక్క విద్యార్థి లేడని అంటున్నారు.